Social Media Ban for Children in AP : ఏపీలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయటంపై ప్రభుత్వం ఫోకస్ పెటటింది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేయగా… త్వరలోనే విధివిధానాలు తయారుచేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయనున్నారు.
విధివిధానాలు రూపకల్పన - మంత్రుల బృందం చర్చ
ఇదే అంశంపై తాజాగా ఐటీ మంత్రి నారా లోకేశ్ సమీక్షించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై మంత్రుల బృందం చర్చించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ…. పిల్లలకు వయసు ఆధారిత కంటెంట్ ను అందుబాటులో ఉంచేవిధంగా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళలపట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ పై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు.
పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాగ్ డే రోజున ఉపాధ్యాయులు విద్యార్థులకు, ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే మెగా పిటిఎంలో కూడా తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
వయసు నిర్దారణ కోసం డిజిలాకర్ తో కూడిన ఏజ్ టోకెన్ ల వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం అనంతరం కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సున్నితమైన కంటెంట్ ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచడంపై విధివిధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ – 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
ప్రశ్న: ఏ వయసు లోపు వారికి సోషల్ మీడియా నిషేధించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది?
జవాబు: 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా కసరత్తు చేస్తోంది.
ప్రశ్న: ఈ చట్టం రూపకల్పనలో ఏ దేశాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు?
{{/usCountry}}జవాబు: 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా కసరత్తు చేస్తోంది.
ప్రశ్న: ఈ చట్టం రూపకల్పనలో ఏ దేశాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు?
{{/usCountry}}జవాబు: ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు డెన్మార్క్ వంటి దేశాల్లో అమలులో ఉన్న మైనర్ల డిజిటల్ భద్రతా చట్టాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
ప్రశ్న : ఏపీ సర్కార్ ఎప్పుడు ఈ చట్టం తీసుకురాబోతుంది..?
జవాబు : ముసాయిదా చట్టం సిద్ధం చేసిన తర్వాత ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ ఆమోదం తర్వాత… గవర్నర్ సంతకం చేయాలి. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది.