...
...
Next Story

AP ACB : దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి అరెస్ట్ - ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు..!

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. విజయవాడ, తాడేపల్లిలోని ఆమె నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించింది. కేసు నమోదు చేయగా…. విచారణ జరుగుతోంది.

Published on: Apr 08, 2026 08:39 AM IST
Advertisement

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లితో పాటు ఉండవల్లిలో అధికారులు నిర్వహించిన సోదాల్లో… భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు… రాత్రి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు.

భారీగా అక్రమాస్తులు..!

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి అరెస్ట్..!
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి అరెస్ట్..!

శాంతి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగానే ఆస్తులు బయటపడ్డాయి. సుమారు 50 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తుల పత్రాలు, భారీగా బంగారం, భారీగా నగదు లభించినట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం, బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం… విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, కుంచనపల్లిలో G+2 భవనం ఉంది. 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి లభ్యమైంది. ఒక వోక్స్‌వ్యాగన్ పోలో కారు, ఒక మోటార్ సైకిల్ ఉంది.ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇతర విలువైన వస్తువులను గుర్తించారు. సోదాల్లో శాంతి పేరిట విజయవాడ వన్‌టౌన్‌లోని యూనియన్‌ బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు గుర్తించారు. కోర్టు అనుమతితో లాకర్‌ తెరవనున్నారు.

2020లో ఏపీపీఎస్సీ ద్వారా శాంతి ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో విశాఖపట్నం, విజయవాడలో విధులు నిర్వహించారు. జూలై 2024 నుండి మార్చి 2026 వరకు సస్పెన్షన్‌లో ఉండగా… ఇటీవలనే సస్పెన్షన్ ఎత్తివేశారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో శాంతి అత్యంత కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవటంతో పలు కారణాలతో ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe