...
...
Next Story

ఏపీపీఎస్సీ గ్రూప్-1పై హైకోర్టు కీలక ఉత్తర్వులు.. మూల్యాంకనంలో అక్రమాలపై సిట్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీపీఎస్సీ గ్రూప్-1పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Published on: Feb 11, 2026 04:56 PM IST
Advertisement

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

'కేసు దర్యాప్తులో రాష్ట్రం వెలుపలి ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయో.. లేదో.. నిర్ధారించాలి. జవాబు పత్రాలు తారుమారు చేశారా? చూడాలి.' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మూల్యాంకనంలో అక్రమాలను బయటపెట్టేందుకుగానూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయేలాని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అనేది చూడాలని చెప్పింది. వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలన చేయాలని న్యాయస్థానం పేర్కొంది.

'విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో ఉపయోగించిన బార్‌కోడ్‌లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు ఒకదానితోఒకటి సరిపోలుతున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. వారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలి. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలి.' అని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe