...
...
Next Story

AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు - ఒంటిమిట్టలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు, ఐఎండీ హెచ్చరికలు

AP Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు బయటికి వెళ్లలేని పరిస్థితులుంటున్నాయి.రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని

Published on: Apr 15, 2026 08:42 AM IST
Advertisement

AP Telangana Weather Report : ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో…. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొన్నిచోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు (image source istock)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు (image source istock)

ఏపీలో మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

బుధవారం రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం4,విజయనగరం19,మన్యం 14, అల్లూరి1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1,తూర్పుగోదావరి 1 మండలాల్లో(46) తీవ్రవడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయి. ఎండ

కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో 44. 2 డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

తెలంగాణలో మండుతున్న ఎండలు…

మరోవైపు తెలంగాణలోనూ కూడా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

మంగళవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఐద్రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు దాటే అవకాశముంది. మంగళవారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 43.3, ఆదిలాబాద్‌లో 43.2, సిద్దిపేటలో 42.9, కామారెడ్డిలో 42.8, కరీంనగర్‌లో 42.8, మంచిర్యాల 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe