...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్..! చరపల్లి - తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇవిగో వివరాలు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. వచ్చే జూలైలో ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Jun 15, 2025, 15:29:53 IST
By , , Andhrapradesh, Tirupati
Prefer HTon Google
Advertisement

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. మొత్తం 26 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులకు… మరికొన్ని రోజులు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

26 ప్రత్యేక రైళ్లు పొడిగింపు..

చర్లపల్లి - తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు
చర్లపల్లి - తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం….చర్లపల్లి - తిరుపతి (నంబర్ 07017) మధ్య నడిచే ప్రత్యేక రైలు... జూలై 4 నుంచి జూలై 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుపతి - చర్లపల్లి ( నంబర్ 07018) మధ్య నడిచే ప్రత్యేక రైలు.. జూలై 5 నుంచి జూలై 28వ తేదీ వరకు ప్రతి సోమ, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా 8 సర్వుసులు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు.

మరోవైపు చర్లపల్లి - తిరుపతి(ట్రైన్ నంబర్ 07251) ట్రైన్... జూలై 2 నుంచి జూలై 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6:50 నిమిషాలకు చర్లపల్లినుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 6:55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 5 సర్వీసులు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. మొత్తంగా 26 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe