...
...
Next Story

తిరుమల కల్తీ నెయ్యి కేసు : ఏకసభ్య కమిటీ ఏర్పాటు - ఏపీ సర్కార్ ఉత్తర్వులు

తిరుమల కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ ఏర్పాటైంది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Published on: Feb 20, 2026, 18:01:10 IST
Advertisement

తిరుమల కల్తీ నెయ్యి కేసు విషయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లతో పాటు సిట్ నివేదికను అధ్యయం చేయనుంది.తదుపరి చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

తిరుమల కల్తీ నెయ్యి కేసు : ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల కల్తీ నెయ్యి కేసు : ఏకసభ్య కమిటీ ఏర్పాటు

మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుపై ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్‌పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.

సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి వివిధ డెయిరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారుల మధ్య నేరపూరిత కుట్ర జరిగిందని సిట్ ఆరోపించింది. అనర్హమైన డెయిరీలు నకిలీ పత్రాలను సమర్పించి, తక్కువ ధరలను కోట్ చేయడం ద్వారా టెండర్లను పొందాయని ఆరోపణలు ఉన్నాయి.

సిట్ విచారణ ప్రకారం.. ప్రధానంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి చెందిన పోమిల్ జైన్(A-3), విపిన్ జైన్ (A-4) లంచాలు చెల్లించారు. కమిషన్ ఏజెంట్ల ద్వారా నిధులు మళ్లించారు. ఢిల్లీ హవాలా దుకాణాల నుండి విజయవాడ (భరత్ భాయ్ ఠాకూర్), చెన్నై (మదారం దేవాసి), హైదరాబాద్ (అర్జున్ గోస్వామి) ఏజెంట్లకు టోకెన్ ఆధారిత కరెన్సీ వెరిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి నిధులను తరలించే హవాలా నెట్‌వర్క్ ఉన్నాయని ఛార్జిషీట్ పేర్కొంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks