TTD Srivari Vaidya Seva : కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, నాణ్యమైన ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త అడుగు వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ అనుబంధ ఆసుపత్రుల్లో “శ్రీవారి వైద్య సేవ” అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా వైద్యులు తమ పేర్లను సులభంగా నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, నగరాల్లో ఉన్న ప్రముఖ వైద్య నిపుణుల సేవలను తిరుమల, తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మక దశలో అమలు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఇందులో పాల్గొనే వైద్య నిపుణుల నుంచి వచ్చే సలహాలు, అభిప్రాయాలను సేకరించి భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు.. కేవలం వైద్యమే కాకుండా విద్య, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి భక్తులకు సేవలందించేందుకు వచ్చే వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు దేశ విదేశాల నుండి వచ్చే నిపుణులకు అవసరమైన వసతి, నాణ్యమైన భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పించనున్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి, ఎక్కువ మంది స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుకింగ్
ఈ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీలను ఆన్లైన్లో చూసుకుని, స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, సాధారణ ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ కాలంలో వారికి తిరుమల లేదా తిరుపతిలో టీటీడీ ఉచిత వసతి, భోజన సదుపాయాలు సమకూరుస్తుంది.
{{/usCountry}}ఈ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీలను ఆన్లైన్లో చూసుకుని, స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, సాధారణ ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ కాలంలో వారికి తిరుమల లేదా తిరుపతిలో టీటీడీ ఉచిత వసతి, భోజన సదుపాయాలు సమకూరుస్తుంది.
{{/usCountry}}ఈ వైద్యులు టీటీడీకి చెందిన కింది ప్రముఖ ఆసుపత్రులు, సంస్థల్లో సేవలు అందిస్తారు….
- అశ్విని ఆసుపత్రి (తిరుమల)
- స్విమ్స్ (SVIMS)
- బర్డ్ (BIRD) ఆసుపత్రి
- ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి
- శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం (సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి)
- ఎస్వీ గోశాల
హిందూ మతానికి చెందిన ఆసక్తి గల వైద్య నిపుణులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా తమ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖ వైద్యులు ఈవో రవిచంద్రతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. "టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి భక్తులకు సేవలందించే అవకాశం లభించడాన్ని మేము వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంగా భావిస్తున్నాం" అని హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం అభిప్రాయపడ్డారు.