తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రహోమం) శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ రుద్రహోమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
కార్తీక వన భోజనాలు
కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరిగింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేశారు.
ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.
శ్రీవారి సేవలో ముఖేశ్ అంబానీ
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంంబానీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థాం అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశ్వీరచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
{{/usCountry}}తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంంబానీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థాం అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశ్వీరచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
{{/usCountry}}