టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' (Dacoit) విడుదల తేదీ మారడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని మూవీ టీమ్ భావించినప్పటికీ, తాజాగా ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణాన్ని అడివి శేష్ స్వయంగా వెల్లడించాడు.
థియేటర్ల సమస్య వల్లే ఈ నిర్ణయం

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ.. 'ధురంధర్ 2' (Dhurandhar 2) సినిమా ప్రభావం వల్లే తాము వెనక్కి తగ్గామని నిజాయితీగా అంగీకరించాడు.
"మార్చి 19న ధురంధర్ 2 విడుదలవుతోంది. ఆ సినిమాతో పోటీ పడితే మాకు కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయనే భరోసా లేదు. అందుకే ప్రాక్టికల్‌గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన వివరించాడు.
కంటెంట్‌పై నమ్మకం ఉంది కానీ..
'ధురంధర్ 2' మీ సినిమాపై ఎంతమేర ప్రభావం చూపింది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. "కంటెంట్ పరంగా మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ రిలీజ్ పరంగా ఆ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 'డెకాయిట్' అనేది యాక్షన్ రిథమ్‌లో సాగే ఒక లోతైన భావోద్వేగపూరితమైన ప్రేమకథ. అయితే 'ధురంధర్ 2' దేశంలోనే అతిపెద్ద సినిమా. దానికి తగిన గౌరవం ఇవ్వాలి. మంచి థియేటర్లు, షోలు దక్కించుకోవడమే మా లక్ష్యం. అందుకే తేదీని మార్చాం" అని స్పష్టం చేశాడు.
అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమాలతో అనవసర పోటీ కంటే, తమ సినిమాకు సరైన థియేటర్లు దొరికేలా చూసుకోవడమే ఉత్తమమని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు.
డెకాయిట్ మూవీ గురించి..
{{/usCountry}}అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమాలతో అనవసర పోటీ కంటే, తమ సినిమాకు సరైన థియేటర్లు దొరికేలా చూసుకోవడమే ఉత్తమమని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు.
డెకాయిట్ మూవీ గురించి..
{{/usCountry}}డెబ్యూ డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వం వహించిన డెకాయిట్ మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో మాజీ ప్రేమికులైన ఇద్దరు వ్యక్తులు కొన్ని దొంగతనాలు చేయాల్సి వస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి 'టైమ్స్ నౌ'తో అడివి శేష్ మాట్లాడుతూ.. డెకాయిట్ ను ఆధునిక ‘షోలే’ మూవీ అని పిలిచాడు. ‘‘ఇది చాలా ఎమోషనల్, ఆవేశంతో కూడిన కథ. డెకాయిట్ లో నవ్వు, కోపం, కన్నీళ్లు.. ఇలా సినిమాల్లో ఉండాల్సిన ప్రతి ఎమోషన్ ఉంటుంది’’ అని అడివి శేష్ చెప్పాడు.
అటు ధురంధర్ 2 దెబ్బకు టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. పెద్ది, పారడైజ్ లాంటి మూవీస్ కూడా తప్పుకున్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన రిలీజ్ ను ముందుకు జరిపి ధురంధర్ 2కి పోటీగా నిలబెట్టడం విశేషం.