...
...
Next Story

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సెల్వరాఘవన్ సినిమా.. లేటేస్ట్ తమిళ్ మూవీ.. 9 ఐఎండీబీ రేటింగ్

OTT: ఓటీటీలోకి తమిళ లేటెస్ట్ మూవీ వచ్చేస్తోంది. పాపులర్ డైరెక్టర్ సెల్వరాఘవన్ లీడ్ రోల్ ప్లే చేసిన మరో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రానికి ఐఎండీబీలో 9 రేటింగ్ ఉండటం విశేషం.

Published on: Apr 29, 2026, 09:34:20 IST
Advertisement

OTT: పాపులర్ తమిళ డైరెక్టర్ కమ్ నటుడు సెల్వరాఘవన్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ సినిమా ‘మణిదన్ దైవమంగళం’. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ ప్రకటించేశారు.

మణిదన్ దైవమంగళం ఓటీటీ

ఓటీటీలోకి తమిళ సినిమా (x/sunnxt)
ఓటీటీలోకి తమిళ సినిమా (x/sunnxt)

తమిళంలో ఇటీవల వచ్చిన రూరల్ డ్రామా ఫిల్మ్ ‘మణిదన్ దైవమంగళం’. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మే 1 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం తమిళంలోనే రిలీజ్ అవుతుంది.

9 రేటింగ్

మణిదన్ దైవమంగళం సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, ఖుషీ రవి, ఆర్ఎస్ సతీష్, మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్, లిర్థిక, సేలం దీపక్, ఎలా భరత్ తదితరులు నటించారు. మణిదన్ దైవమంగళం మూవీకి డెనిస్ మంజునాథ్ డైరెక్టర్. ఏప్రిల్ 10, 2026న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది.

మణిదన్ దైవమంగళం స్టోరీ

మణిదన్ దైవమంగళం సినిమా ఓ గ్రామీణ నేపథ్యలో తెరకెక్కిన చిత్రం. స్థానిక ఎంఎల్ఏను ప్రశ్నించినందుకు ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది సినిమాలో చూపించారు.

రాఘవన్ గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండవు. రాఘవన్ బంధువు ఒకామె స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, వడ్డీ వ్యాపారీ అయిన ఇన్బరాజ్ (మైమ్ గోపీ) నుంచి అప్పు తీసుకుంటుంది. ఆ డబ్బుతో రాఘవన్, సెల్వి కలిసి హైవే పక్కన దాబా ఏర్పాటు చేస్తారు. అంతా సాఫీగా సాగుతుందనుకుని సమయంలో కథ అడ్డం తిరుగుతుంది.

ఊర్లో సమస్యల కోసం ఎమ్మెల్యేకు రాఘవన్ వినతిపత్రం ఇస్తాడు. ఆ క్రమంలో ఇన్బరాజ్ పరువు పోతుంది. దీంతో రాఘవన్ పై అతను పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రాఘవన్ కుటుంబం ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకుంది? అనేది మణిదన్ దైవమంగళం సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks