ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సలార్: పార్ట్ 1'కు సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్ 2' (Salaar 2) ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన 'ది రాజా సాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో, నిర్మాతలు 'సలార్ 2'ను నిరవధికంగా వాయిదా వేశారని ఒక ప్రముఖ పత్రిక రిపోర్ట్ చేసింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథను మార్చాలని దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ భావిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం.
పుకార్లకు చెక్ పెట్టిన సలార్ మేకర్స్

సలార్ మూవీ సీక్వెల్ పక్కన పట్టలేదని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్.. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సినిమాలో 'ఆద్య' పాత్రలో నటించిన శృతి హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్, శృతి హాసన్ ఇద్దరూ ఒక ఫోన్ చూస్తూ నవ్వుతూ ఉన్న ఫోటోను పంచుకున్నారు.
అయితే దీనికి పెట్టిన క్యాప్షన్ హైలైట్ గా నిలిచింది. ఆ ఫోటోకు పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. "సలార్ 2లో తనకు ఏం జరుగుతుందో ఆద్య (శృతి).. దేవా (ప్రభాస్)కు చూపిస్తోంది!! మీరేమనుకుంటున్నారో చెప్పండి?" అని రాసుకొచ్చారు. ఈ ఒక్క పోస్ట్‌తో సినిమా ఆగిపోలేదని, పనులు సజావుగా సాగుతున్నాయని మేకర్స్ చెప్పకనే చెప్పారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్
సలార్ మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. "ఎట్టకేలకు దేవా నవ్వుతూ కనిపించాడు", "సలార్ 2లో ఆద్య కోసం దేవా చేసే సాహసాలు ఊహించుకుంటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సలార్ 2లో ఏం ఉండబోతోంది?
'సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం' మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలవుతుంది. ఖాన్సార్ రాజ్యంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా (ప్రభాస్), వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) బద్ధ శత్రువులుగా ఎలా మారారు? వారి మధ్య ఘర్షణ ఖాన్సార్‌ను ఎలా మారుస్తుందన్నదే ఈ సీక్వెల్ కథ.
{{/usCountry}}'సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం' మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలవుతుంది. ఖాన్సార్ రాజ్యంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా (ప్రభాస్), వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) బద్ధ శత్రువులుగా ఎలా మారారు? వారి మధ్య ఘర్షణ ఖాన్సార్‌ను ఎలా మారుస్తుందన్నదే ఈ సీక్వెల్ కథ.
{{/usCountry}}