రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండగలాంటి న్యూస్. అతని నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్ నుంచి ఓ కీలకమైన అప్డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ అనౌన్స్‌మెంట్ ను మేకర్స్ శుక్రవారం (నవంబర్ 21) ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చేశారు.
ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ల వేగం పెంచారు. రెబల్ సాబ్ పేరుతో ఫస్ట్ సింగిల్ తీసుకురానున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను ఆదివారం (నవంబర్ 23) రిలీజ్ చేయనున్నారు.
శుక్రవారం (నవంబర్ 21) ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. "ద మ్యాన్ ఆఫ్ స్వాగ్" అనే వైబ్‌ని క్రియేట్ చేశాడు. “స్టైల్ స్వాగ్ ఎంట్రీ లెవెల్.. రెబల్ సాబ్ మన డార్లింగ్ లోని పీక్ చూపించబోతోంది. ఈ నవంబర్ 23ను పండగ రోజుగా మార్చనుంది” అనే క్యాప్షన్ తో మేకర్స్ ట్వీట్ చేశారు.
ది రాజా సాబ్ మూవీ గురించి..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టి.జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్ జానర్లో రాబోతోంది. ప్రభాస్ ఇప్పటివరకు చేయని డిఫరెంట్ జానర్ ఇది.
ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ "రెబల్ సాబ్" ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
{{/usCountry}}ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ "రెబల్ సాబ్" ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
{{/usCountry}}దర్శకుడు మారుతి ఈ సినిమాని కేవలం హారర్ ఎలిమెంట్స్‌తోనే కాకుండా, ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దుతున్నాడు. మొత్తానికి “రెబల్ సాబ్”తో ఇక నుంచి రాజా సాబ్ మానియా మొదలైనట్లే కనిపిస్తోంది.