...
...
Next Story

వాళ్లు అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది.. అది మాకు చాలా పవిత్రమైనది.. అలా చేయొద్దని చెబుతాను: రిషబ్ శెట్టి

కాంతారలోని దైవాలను హేళన చేసేలా రణ్‌వీర్ సింగ్ ఈ మధ్య చేసిన నటనపై రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించాడు. ఎవరైనా అలా చేయడం చూస్తుంటే తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని అతడు చెప్పాడు. ఆ దైవాలు తమకు ఎంతో పవిత్రమైనవని తెలిపాడు.

Published on: Dec 15, 2025, 21:48:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) వేదికపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ 'కాంతార' దైవాన్ని అనుకరించడం వివాదానికి దారితీసింది. దీనిపై తాజాగా 'కాంతార' స్టార్ రిషబ్ శెట్టి స్పందించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దైవారాధన అనేది తమకు అత్యంత పవిత్రమైనదని, దానిని స్టేజ్ మీద ఇమిటేట్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రిషబ్ శెట్టి రియాక్షన్ ఇలా..

వాళ్లు అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది.. అది మాకు చాలా పవిత్రమైనది.. అలా చేయొద్దని చెబుతాను: రిషబ్ శెట్టి
వాళ్లు అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది.. అది మాకు చాలా పవిత్రమైనది.. అలా చేయొద్దని చెబుతాను: రిషబ్ శెట్టి

ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చేసిన పని తీవ్ర దుమారం రేపింది. రిషబ్ శెట్టి వారిస్తున్నా వినకుండా రణ్‌వీర్ రెండుసార్లు అలా చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా రిషబ్ శెట్టి చెన్నైలో జరిగిన 'బిహైండ్‌వుడ్స్' ఈవెంట్‌లో మౌనం వీడాడు.

రణ్‌వీర్ పేరు ఎత్తకుండానే, దైవాన్ని ఇమిటేట్ చేయడంపై ఘాటుగా స్పందించాడు. 'కాంతార' వంటి సినిమా తీసినప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు కేవలం పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఉందని రిషబ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

బాధగా ఉంటుంది..

"సినిమాలో ఆచారాలను గౌరవప్రదంగా చూపించడానికి నేను ఎంతోమంది పెద్దల సలహాలు తీసుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక జనం దాన్ని ఇమిటేట్ చేయడం చూస్తుంటే.. నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. సినిమాలో మిగతాదంతా నటన కావచ్చు.. కానీ దైవం ఎలిమెంట్ అనేది చాలా సున్నితమైనది, పవిత్రమైనది. నేను ఎక్కడికి వెళ్ళినా.. దయచేసి దాన్ని స్టేజ్ మీద ప్రదర్శించకండి, వెటకారం చేయకండి అని వేడుకుంటున్నాను. అది మా ఎమోషన్స్‌తో ముడిపడి ఉన్న విషయం" అని రిషబ్ ఎమోషనల్ అయ్యాడు.

అసలేం జరిగిందంటే?

"రిషబ్ నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఒక నటుడిగా ఆ సీన్ చేయడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు గౌరవం ఉంది. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి" అని రణ్‌వీర్ పేర్కొన్నాడు.

రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' (2022).. ఈ ఏడాది వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' (2025).. రెండూ కేజీఎఫ్ 2 తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ చిత్రాలుగా రికార్డు సృష్టించాయి. మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks