...
...
Next Story

Iran – Israel War : రియాద్లో ఉద్రిక్తత పరిస్థితులు - అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..!

సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడికి పాల్పడింది. రెండు డ్రోన్లతో దాడి జరిపినట్లు తెలిసింది. ఈ దాడిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కు గట్టి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Published on: Mar 3, 2026, 08:04:35 IST
Advertisement

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులపై రగిలిపోతున్న ఇరాన్…. ప్రతిదాడులకు దిగుతోంది. అమెరికాను కూడా టార్గెట్ చేస్తూ… దాడులకు చేపట్టింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో దాడికి పాల్పడింది.

అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి..! (HT )
అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి..! (HT )

డ్రోన్ల దాడి దాటికి రాయబార కార్యాలయం పరిసరాల్లో భారీ శబ్దం వినిపించటమే కాకుండా మంటలు కూడా చెలరేగాయి. ఈ విషయాన్ని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ కూడా ధ్రువీకరించింది.

రియాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్లు దాడి చేయడంతో చిన్న మంటలు చెలరేగాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. భవనానికి స్వల్ప నష్టం జరిగినట్లు వెల్లడించారు.

రాయబార కార్యాలయం చుట్టూ అగ్నిమాపక యంత్రాలను చూశామని ఇద్దరు సాక్షులు AFP కి చెప్పారు.ఇదే భవనంపై పొగను కూడా చూశామని పేర్కొన్నారు. రియాద్‌లోని దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.

మరోవైపు ఇరాన్.. గల్ఫ్ అంతటా ప్రతీకార దాడులతో ముందుకు సాగుతోంది. సోమవారం కువైట్ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పొగ వెలువడింది. ఈ విషయాన్ని ఓ దౌత్యధికారి ధ్రువీకరించారు.

ట్రంప్ వార్నింగ్…!

అమెరికా రాయబార కార్యాలయాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ కు గట్టి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.ఈసారి మరింత భీకర దాడులు చేస్తామని, మాపై దాడులు చేసిన వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks