కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే అందనుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఊరించిన కరవు భత్యం (డీఏ - Dearness Allowance) పెంపు ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన వెలువడితే దాదాపు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి అదనపు సొమ్ము చేరనుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి పాత తేదీతో అమలులోకి రానుంది.

నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్చి నెలలోనే ఈ పెంపు వస్తుందని ఆశించారు. అయితే అప్పట్లో ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
డీఏ పెంపు ఎంత ఉండవచ్చు?
గతంలో అక్టోబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం డీఏను 55 శాతం నుంచి 58 శాతానికి పెంచింది. ఇది జూలై 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు ఏప్రిల్ 2025 లో డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. ఇప్పుడు రాబోయే తాజా ప్రకటనలో డీఏను మరో 3 శాతం పెంచి, మొత్తం బేసిక్ పేలో 61 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అసలు డీఏ అంటే ఏమిటి?
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని ఉద్యోగులు తమ జీవన ప్రమాణాలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే భత్యమే ఈ డీఏ. ఇది పూర్తిగా ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) పై ఆధారపడి ఉంటుంది.
మీ జీతం ఎంత పెరుగుతుందంటే?
ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందనేది వారి బేసిక్ పే (ప్రాథమిక వేతనం)పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 56,100 ఉందనుకుందాం. ప్రస్తుతం ఉన్న 58 శాతం డీఏ ప్రకారం ఆ ఉద్యోగికి రూ. 32,538 అందుతోంది. ఒకవేళ డీఏ 61 శాతానికి పెరిగితే, ఆ మొత్తం రూ. 34,221 అవుతుంది. అంటే ప్రతి నెలా రూ. 1,683 అదనంగా లభిస్తుంది.
ఇక బకాయిల (Arrears) విషయానికి వస్తే... ఈ పెంపు జనవరి నుంచి వర్తిస్తుంది కాబట్టి, జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల బకాయిలు, ఏప్రిల్ నెల డీఏ కలిపి చూస్తే... ఆ ఉద్యోగికి ఒకేసారి రూ. 6,732 (రూ. 1683 x 4) అదనంగా చేతికి అందుతాయి. ఉద్యోగుల బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ మొత్తం కూడా పెరుగుతుంది.
8వ వేతన సంఘం అప్‌డేట్
{{/usCountry}}ఇక బకాయిల (Arrears) విషయానికి వస్తే... ఈ పెంపు జనవరి నుంచి వర్తిస్తుంది కాబట్టి, జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల బకాయిలు, ఏప్రిల్ నెల డీఏ కలిపి చూస్తే... ఆ ఉద్యోగికి ఒకేసారి రూ. 6,732 (రూ. 1683 x 4) అదనంగా చేతికి అందుతాయి. ఉద్యోగుల బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ మొత్తం కూడా పెరుగుతుంది.
8వ వేతన సంఘం అప్‌డేట్
{{/usCountry}}మరోవైపు, ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) గురించి కూడా కీలక అప్‌డేట్ వచ్చింది. నిజానికి ఈ కమిషన్ జనవరి 1, 2026 నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన కసరత్తులు ఆలస్యం కావడంతో, ఇది 2027 మధ్య నాటికి పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈలోగా పెరుగుతున్న డీఏ మాత్రమే ఉద్యోగులకు కొండంత ఊరటనిస్తుంది.
కాగా, ఎనిమిదో వేతన సంఘం బృందం దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా ఏప్రిల్ 24న డెహ్రాడూన్ సందర్శించనుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అక్కడ వివిధ సంఘాలతో చర్చలు జరిపి తన నివేదికను సిద్ధం చేయనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. తాజా డీఏ పెంపు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?
ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించినప్పటికీ, ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి పాత తేదీతో అమలులోకి వస్తుంది. ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు కూడా లభిస్తాయి.
2. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఎంత శాతంగా ఉంది?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బేసిక్ పే లో 58 శాతంగా ఉంది. తాజా పెంపుతో ఇది 61 శాతానికి చేరనుంది.
3. డీఏ అంటే ఏమిటి, దీన్ని ఎందుకు ఇస్తారు?
డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్ (కరవు భత్యం). దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను తట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఈ భత్యాన్ని అందిస్తుంది.