...
...
Next Story

మధ్యతరగతి కుటుంబాల కోసం 7 సీటర్​ ఎంపీవీ- నిస్సాన్​ గ్రావిటే హైలైట్స్ ఇవి​..

నిస్సాన్ నుంచి వస్తున్న సరికొత్త 7-సీటర్ ఎంపీవీ ‘గ్రావిటే’పై మంచి బజ్​ నెలకొంది. రెనాల్ట్​ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ కారు టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Dec 30, 2025 11:20 AM IST
Advertisement

భారత మార్కెట్​పై నిస్సాన్ ఇండియా తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రానున్న సంవత్సరాల్లో వరుస లాంచ్​లను ప్లాన్​ చేస్తోంది. వీటిల్లో సరికొత్త 7-సీటర్​ ఎంపీవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని పేరు నిస్సాన్​ గ్రావిటే. మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ధరలో లగ్జరీ అనుభూతిని ఈ కారు అందిస్తుందని తెలుస్తోంది. కాగా ఈ ఎంపీవీకి సంబంధించిన మోడల్​ ఒకటి భారత రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కారులోని కొన్ని కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్​ గ్రావిటే ఎంపీవీ- ఇండియా లాంచ్​..

నిస్సాన్​ గ్రావిటే ఎంపీవీ..
నిస్సాన్​ గ్రావిటే ఎంపీవీ..

రోడ్లపై ప్రత్యక్షమైన గ్రావిటే ఎంపీవీ.. వచ్చే ఏడాది, అంటే మార్చి 2026లో లాంచ్​ అవుతుంది. అదే సమయంలో ఈ కారు ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, అఫీషియల్ లాంచ్‌కు ముందే ఈ కారు టెస్టింగ్ దశలో కెమెరా కంటికి చిక్కింది. జాతీయ రహదారిపై వెళుతున్న ఈ టెస్ట్ మోడల్‌ను వివేక్ ఆర్ అనే వ్యక్తి వీడియో తీశారు. కారు మొత్తం కామోఫ్లాజ్​తో ఉన్నప్పటికీ, దీని రూపం చూస్తుంటే ఇది రెనాల్ట్​ ట్రైబర్‌ను పోలి ఉన్నట్లు స్పష్టమవుతోంది.

రెనాల్ట్​-నిస్సాన్ భాగస్వామ్యంలో వస్తున్న ఈ కారు సీఎంఫ్-ఏ+ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటోంది.

నిస్సాన్​ గ్రావిటే- డిజైన్ ఎలా ఉండబోతోంది?

గ్రావిటే కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండనుంది. ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, బోనెట్‌పై ‘GRAVITE’ అనే పేరు స్పష్టంగా కనిపించనున్నాయి. మధ్యలో పెద్ద గ్రిల్, సీ-షేప్ బంపర్ ఈ 7 సీటర్​ ఫ్యామిలీ ఎంపీవీకి ఒక రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి.

నిస్సాన్ ఈ కారు కోసం ప్రత్యేకంగా ‘టీల్’ రంగును పరిచయం చేస్తోంది. అంతేకాదు స్పోర్టీ అలాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ కారుకి ఒక ఎస్‌యూవీ తరహా రాజసాన్ని జోడిస్తాయి. వెనుక వైపు కూడా సీ-షేప్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ టచ్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు.

నిస్సాన్​ గ్రావిటే- ఇంజిన్, పనితీరు..

రెనాల్ట్​ ట్రైబర్ ఫీచర్లను చాలా వరకు ఈ గ్రావిటే ఎంపీవీలోనూ చూడవచ్చు. 8-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఇందులో ఉంటాయి. భద్రత విషయంలో రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-వ్యూ కెమెరాను కూడా నిస్సాన్ అందిస్తోంది. నిస్సాన్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఇంటీరియర్ కలర్స్, సీట్ అప్‌హోల్‌స్టరీని మరింత కొత్తగా డిజైన్ చేస్తున్నారు. సెకండ్, థర్డ్- రో ప్రయాణికులకు కూడా ఏసీ వెంట్స్ ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇక్కడ నిస్సాన్​ గ్రావిటే ప్రైజింగ్​ కీలకంగా మారనుంది. దేశంలో తక్కువ ధరకు లభిస్తున్న ఫ్యామిలీ ఎంపీవీల్లో రెనాల్ట్​ ట్రైబర్​ ఒకటి. ఈ గ్రావిటేని కూడా అందుబాటు ధరలో తీసుకొస్తే.. ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, ఆధునిక ఫీచర్లు కోరుకునే భారతీయ కుటుంబాలకు ఈ నిస్సాన్ గ్రావైట్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe