...
...
Next Story

Puducherry Exit Poll 2026: పుదుచ్చేరిలో మ‌ళ్లీ ఎన్డీయేనే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ 2026 అంచనాలు

Puducherry Exit Poll 2026: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.

Published on: Apr 29, 2026 06:31 PM IST
Advertisement

Puducherry Exit Poll 2026: పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 16 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. ఇక్కడ ఒకటి రెండు స్థానాలు తేడా కొట్టినా అధికారం మారిపోతుంది.

పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు
పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు

పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్‌కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్‌టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది.

అత్యధిక సీట్లు గెలిచే పార్టీ

ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్‌పీఏ కూటమిలోని డీఎంకే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.

పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి. పుదుచ్చేరిలో దాదాపు 68 శాతం మంది ముఖ్యమంత్రిగా ఎన్.రామస్వామికి మద్దతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe