బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు పెరిగి 82,276 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58 పాయింట్లు వృద్ధిచెంది 25,482 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్లు పడి 61,043 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,024.50 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,639.97 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపించడం లేదు. నిఫ్టీ50లో ప్రస్తుతానికి సెల్ ఆన్ రైజ్ పాటర్న్ కొనసాగుతోంది. సూచీకి 25,700- 25,800 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. 25,400- 25,350 వద్ద బలమైన సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.81శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.26 శాతం పెరిగింది.
అమెరికా స్టాక్ మార్కెట్లో సానుకూలతకు టెక్ దిగ్గజం ఎన్వీడియా త్రైమాసిక ఫలితాలే కారణంగా. ఈ చిప్ తయారీ సంస్థ అంచనాలకు మించిన ఫలితాల్ని ప్రకటించింది. ఫలితంగా ఈ ఎన్వీడియా స్టాక్ 1.4శాతం వృద్ధి చెంది 196 డాలర్ల వద్ద స్థిరపడింది.
{{/usCountry}}అమెరికా స్టాక్ మార్కెట్లో సానుకూలతకు టెక్ దిగ్గజం ఎన్వీడియా త్రైమాసిక ఫలితాలే కారణంగా. ఈ చిప్ తయారీ సంస్థ అంచనాలకు మించిన ఫలితాల్ని ప్రకటించింది. ఫలితంగా ఈ ఎన్వీడియా స్టాక్ 1.4శాతం వృద్ధి చెంది 196 డాలర్ల వద్ద స్థిరపడింది.
{{/usCountry}}ఇక ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వేదాంత- బై రూ. 727, స్టాప్ లాస్ రూ. 706, టార్గెట్ రూ. 770
లారస్ ల్యాబ్స్- బై రూ. 1076, స్టాప్ లాస్ రూ. 1030,స టార్గెట్ రూ. 1141
ఔరబిందో ఫార్మా- బై రూ. 1212, స్టాప్ లాస్ రూ. 1160, టార్గెట్ రూ. 1280
మంగళం సిమెంట్- బై రూ. 921, స్టాప్ లాస్ రూ. 885, టార్గెట్ రూ. 1000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- బై రూ. 74.08, స్టాప్ లాస్ రూ. 71, టార్గెట్ రూ. 79