స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం ప్రారంభించడానికి వేదికపైకి రాగానే విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని తప్పుబడుతూ వంద మందికి పైగా విద్యార్థులు తమ సీట్లలోంచి లేచి బయటకు నడిచారు.
'ప్రాజెక్ట్ నింబస్' పై నిరసనల సెగ

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. సుందర్ పిచాయ్ డయాస్ పైకి రాగానే స్టాన్‌ఫర్డ్ స్టేడియంలో కూర్చున్న విద్యార్థుల్లో ఒక వర్గం ఒక్కసారిగా లేచి నిలబడింది. "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేస్తూ వారు వేడుకను బహిష్కరించారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి గూగుల్, అమెజాన్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్న $1.2 బిలియన్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాంట్రాక్ట్ 'ప్రాజెక్ట్ నింబస్'కు వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. గాజాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ సైనిక చర్యలకు ఈ ప్రాజెక్టు సహకరిస్తోందని 'స్టాన్‌ఫర్డ్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా' ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ వాకౌట్ గురించి వారు కొన్ని వారాల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ప్రసంగంలో 'AI' ఊసే ఎత్తని పిచాయ్
ఈ ఏడాది వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో సాంకేతిక రంగ ప్రముఖులు 'AI' గురించి మాట్లాడినప్పుడు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కాబోలు, సుందర్ పిచాయ్ తన కీనోట్ ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తావనే తీసుకోలేదు. దానికి బదులుగా ఆయన "ఆశావాదం" (Optimism) అనే అంశంపై మాట్లాడారు.
"ఎల్లప్పుడూ ఆశావాదాన్ని ఎంచుకోండి. రోజూ వార్తలు చూసినప్పుడు మనం అత్యంత సవాలుతో కూడిన కాలంలో జీవిస్తున్నామనే భావన కలగడం సహజం. కానీ ప్రతి తరం తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొందని గుర్తుంచుకోవడం అవసరం. మనం ఎలాంటి పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసి సమాజంలోకి అడుగుపెడుతున్నామనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ పరిస్థితులను మనం ఎలా స్వీకరిస్తున్నామనేదే ముఖ్యం" అని పిచాయ్ విద్యార్థులకు హితబోధ చేశారు.
{{/usCountry}}"ఎల్లప్పుడూ ఆశావాదాన్ని ఎంచుకోండి. రోజూ వార్తలు చూసినప్పుడు మనం అత్యంత సవాలుతో కూడిన కాలంలో జీవిస్తున్నామనే భావన కలగడం సహజం. కానీ ప్రతి తరం తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొందని గుర్తుంచుకోవడం అవసరం. మనం ఎలాంటి పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసి సమాజంలోకి అడుగుపెడుతున్నామనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ పరిస్థితులను మనం ఎలా స్వీకరిస్తున్నామనేదే ముఖ్యం" అని పిచాయ్ విద్యార్థులకు హితబోధ చేశారు.
{{/usCountry}}స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోనే ఎమ్మెస్ (MS) పూర్తి చేసిన పిచాయ్, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విద్యా రంగం కంటే కార్పొరేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించారు.
స్పందించని గూగుల్ బాస్
స్నాతకోత్సవం ముగిసిన తర్వాత స్టాన్‌ఫర్డ్ స్టేడియం నుండి బయటకు వస్తున్న సుందర్ పిచాయ్‌ను బీబీసీ (BBC) జర్నలిస్ట్ లిల్లీ జమాలీ పలకరించారు. విద్యార్థుల నిరసనపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా, పిచాయ్ ఏమాత్రం స్పందించకుండా ముఖం తిప్పుకుని ముందుకు సాగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.