...
...
Next Story

టీవీఎస్ జూపిటర్ 110 ప్రియం: వేరియంట్ల వారీగా పాత, కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే

టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ 'జూపిటర్ 110' ధరలను పెంచింది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 1,250 వరకు భారం పడనుంది. ముడిసరుకుల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. కొత్త ధరల వివరాలు మీకోసం.

Published on: Feb 5, 2026, 11:11:27 IST
Advertisement

మీరు కొత్తగా స్టైలిష్, ఇంకా ప్రాక్టికల్ స్కూటర్ టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను కొంచెం పెంచుకోవాల్సిందే. మధ్యతరగతి వాహనదారులకు అత్యంత ఇష్టమైన ఈ 110సీసీ స్కూటర్ ధరను కంపెనీ పెంచింది. వేరియంట్‌ను బట్టి దాదాపు రూ.1,250 వరకు బాదుడు తప్పదు. కేవలం జూపిటర్ మాత్రమే కాదు.. కంపెనీకి చెందిన స్టార్ సిటీ ప్లస్, రేడియన్, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ స్వల్పంగా సవరించింది.

ధరలు ఎందుకు పెరిగాయి?

టీవీఎస్ జూపిటర్ 110 ప్రియం: వేరియంట్ల వారీగా పాత, కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే
టీవీఎస్ జూపిటర్ 110 ప్రియం: వేరియంట్ల వారీగా పాత, కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే

గత కొన్ని వారాలుగా దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలను వరుసగా పెంచుకుంటూ పోతున్నాయి. ముడిసరుకుల ధరలు భారమవ్వడం, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య విలువల్లో మార్పుల వంటి కారణాల వల్లే ఈ ధరల పెంపు అనివార్యమైందని సంస్థలు వివరిస్తున్నాయి. టీవీఎస్ కూడా అదే బాటలో నడిచింది.

జూపిటర్ 110: పాత ధర vs కొత్త ధర

వేరియంట్‌ను బట్టి ధరల పెంపు ఏ స్థాయిలో ఉందో ఈ కింది వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది:

  • బేస్ డ్రమ్ ఎస్​ఎండబ్ల్యూ వేరియంట్: ఈ ఎంట్రీ లెవల్ మోడల్‌పై రూ. 750 పెరిగింది. గతంలో దీని ధర రూ.72,650 (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు అది రూ.73,400కు చేరింది.
  • డ్రమ్​ అలాయ్​ వేరియంట్​: ఈ వేరియంట్​ ధర రూ. 550 పెరిగింది. గతంలో దీని ఎక్స్​షోరూం ధర రూ. 77,450గా ఉండేది. ఇప్పుడు రూ. 78,000కి చేరింది.
  • డ్రమ్​ ఎస్​ఎక్స్​సీ వేరియంట్​: ఈ వేరియంట్​ ధర రూ. 850 పెరిగి రూ. 82,100 (ఎక్స్​షోరూం)కి చేరింది.
  • డిస్క్​ ఎస్​ఎక్స్​సీ వేరియంట్​: ఈ వేరియంట్​ ధర పెరగలేదు. ప్రస్తుతం దీని ఎక్స్​షోరూం ధర రూ. 84,750గానే ఉంది.
  • డిస్క్​ ఎస్​ఎక్స్​సీ బీ.ఈ వేరియంట్​: దీనిపై గరిష్టంగా రూ.1,250 పెంచారు. ఫలితంగా పాత ధర రూ.85,650 నుంచి ప్రస్తుతం రూ.86,900కి చేరింది.

కొనే ముందు గమనించాల్సిన విషయం

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks