ఇరాన్ - అమెరికా యుద్ధ పరిస్థితులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా ఎఫ్ - 15 యుద్ధ విమానాన్ని కూల్చేశామని… ఇద్దరు అమెరికన్ పైలెట్‌లు మిస్ అయ్యారని ఇరాన్ ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. ఆ పైలెట్ల కోసం అమెరికా వెతికే ప్రయత్నాలు ప్రారంభించిందని కూడా పేర్కొంది.

ఇరాన్ ప్రకటన ప్రకారం… వారి సైన్యం చేతిలో కూలిన ఫైటర్ జెట్ల సంఖ్య రెండుకు చేరినట్లు అవుతుంది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డాడని, బతికిఉండే అవకాశాలు తక్కువని పేర్కొంది. ఒకవేళ వాళ్లు ప్రాణాలతో ఉంటే… ప్రభుత్వానికి అప్పగించాలని కూడా ప్రకటనలు జారీ అయ్యాయి.
ఇరాన్ ప్రకటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. కానీ అమెరికా మీడియా సంస్థలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మిస్ అయిన పైలెట్ల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నీల్ తో పాటు ఆక్సియోస్ అమెరికా వార్త సంస్థలు నివేదించాయి.
F-15ఫైటర్ జెట్ కూల్చివేతపై ఇరాన్ ప్రకటన నిజమేనా..? లేదా అనే విషయంపై వైట్ హౌస్ వర్గాల నుంచి అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. విమానాన్ని కూల్చివేయడంపై యూఎస్ సెంట్రల్ కమాండ్, పెంటగాన్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
ఈ ఘటనలో కూలిపోయింది ఎఫ్-15 యుద్ధ విమానమేనా అనే విషయంపై కూడా తెలియాల్సి ఉంది. ఒక వేళ ఇదే విషయం నిజమైతే… అమెరికాకు గట్టి షాక్ తగిలినట్లు అవుతుందనే పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫైటర్ జెట్ కూల్చివేత వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రికత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
{{/usCountry}}ఫైటర్ జెట్ కూల్చివేత వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రికత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
{{/usCountry}}