...
...
Next Story

మార్కాపురం బస్సు ప్రమాదం : కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు - సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు

Markapuram Bus Accident Updates : మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది.

Published on: Mar 26, 2026, 10:10:27 IST
Advertisement
<p>ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం వెంటనే భీకర అగ్నిప్రమాదంగా మారింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి</p>

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం వెంటనే భీకర అగ్నిప్రమాదంగా మారింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి

ఈ దుర్ఙటనలో 13 మంది చనిపోగా… మరో 15 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ముందు భాగంలో ఉన్నవారిలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వెనకభాగంలో ఉన్నవారు బయటికి రాలేక… మంటల్లో కాలిపోయినట్లు తెలిసింది. మృతుల్లో కలికిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా పలువురు సజీవ దహనమయ్యారు. టిప్పర్ డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. సెమీ స్లీపర్ బస్సు కావడంతో బయటికి వచ్చేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తెలిసింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడానికి 6304285613, 9985733999, 7989537285, 9703578434 కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe