...
...
Next Story

ఫొటోలు : కర్నూలు బస్సు ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

ఏపీలోని కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు.

Updated on: Oct 24, 2025, 14:16:58 IST
Advertisement
<p>హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి.</p>

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి.

ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు కూడా మరణించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

బస్సు ప్రమాదానికి సంబంధించి తెలంగాణ కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. గద్వాల కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నెంబర్ 9502271122, గద్వాల పోలీసు ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 8712661828, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ 9100901604గా ఉంది.

ఏపీలో కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ : 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ నెంబర్ : 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ నెంబర్ : 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ నెంబర్ : 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010గా ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి అందుతుందని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రమాద ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రయాణికుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు సరైన నియంత్రణతో నడవాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe