...
...
Next Story

ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ కుంభకోణం - హరీశ్ రావ్ సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందన్నారు. మైక్రో బ్రూవరీస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

Published on: Jan 28, 2026 07:15 PM IST
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇందులో 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారని చెప్పారు.

హరీశ్ రావు సంచలన ఆరోపణలు..

మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… "సింగరేణిలో బయటపెట్టాల్సిన కుంభకోణాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఎక్సైజ్ శాఖలో కుంభకోణాన్ని బయటపెడుతున్నా. ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్య నేతకు నీడగా ఉండే ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటికి వెళ్తారు. ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నాడు ఒక్కొక్క బ్రూవరీ దగ్గర అన్అఫీషియల్‌గా 1 కోటి 80 లక్షలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో ఒక కోటి 50 లక్షలు ముఖ్య నేతకు వెళ్తాయి. మరో 30 లక్షలు తోడుగా ఉన్న వ్యక్తికి వెళ్తాయి” అని హరీశ్ రావు ఆరోపించారు.

వైన్స్ షాపుల లక్కీ డ్రా తియ్యకుండా కొందరికే టెండర్లు వచ్చాయని హరీశ్ రావు విమర్శించారు. “రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు రూ. 4 వేల 500 కోట్లు బకాయిలు పెట్టారు. 6 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదు. దీని వల్ల బ్రీజర్ సరఫరా రాష్ట్రంలో ఆగిపోయింది. మల్టీ నేషనల్ కంపెనీలు సరఫరా నిలిపివేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు లేఖలు రాశారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుంది” అని హరీశ్ రావు పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe