హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన శాఖ జారీ చేసిన G.O.Ms.No.43 ప్రకారం, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సమర్పించిన ప్రతిపాదనను వివరణాత్మక పరిశీలన తర్వాత ఆమోదించారు.

ఇందులో భాగంగా నగరంలోని మెట్రో జోన్‌లో ఓవర్ హెడ్ లైన్లను పూర్తిగా తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లను కవర్ చేస్తుంది. TGSPDCL 33kV, 11kV, లో-టెన్షన్ (LT) నెట్‌వర్క్‌లతో సహా ఇప్పటికే ఉన్న 3,899 కి.మీ ఓవర్ హెడ్ (OH) లైన్‌లను భూగర్భ కేబుల్‌లతో భర్తీ చేస్తారు.
అండర్ గ్రౌండ్ కేబులింగ్ నాణ్యతను పెంచుతుందని, అంతరాయాలను తగ్గిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. నెట్‌వర్క్‌ను భూగర్భంలోకి తీసుకురావడం వల్ల విశ్వసనీయత మెరుగుపడుతుందని, నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుందని, మెట్రో ప్రాంతంలో విద్యుత్ పంపిణీ మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుందని ఆ ఉత్తర్వులో పేర్కొంది. మెరుగైన మౌలిక సదుపాయాలు పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంటోంది.
క్షేత్ర పరిస్థితులను బట్టి ట్రెంచ్-బేస్డ్ కేబులింగ్, హెచ్‌డీడీ కలయికను TGSPDCL ప్రతిపాదించింది. లేన్లు, ఇరుకైన ప్రాంతాలలో ఎల్టీ లైన్లు ఏరియల్ బండిల్డ్ కేబుల్‌తో భర్తీ చేస్తారు.
అంతర్గత నిధులు లేదా రుణం ద్వారా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి TGSPDCLకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ట్రెంచింగ్‌లో ఖర్చు భాగస్వామ్యం కోసం టీ-ఫైబర్‌తో సహా టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయాలని కూడా ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని TGSPDCL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడం, అనుకోని విద్యుత్ కోతలు లేకుండా చూడటం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య రంగాలకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ రూపొందిస్తున్నారు.
{{/usCountry}}నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడం, అనుకోని విద్యుత్ కోతలు లేకుండా చూడటం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య రంగాలకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ రూపొందిస్తున్నారు.
{{/usCountry}}