సూర్యాపేటలో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడారు. అసెంబీలో ప్రతిపక్షం లేకుండా కృష్ణానీటిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక్క మాట అన్నారని అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా అని ప్రశ్నించారు. తర్వాతైనా అసెంబ్లీకి రావొచ్చు కదా అన్నారు. మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే.. ప్రతిపక్షం ఉండొద్దా అని అడిగారు. సభ నుంచి వాకౌట్ చేయాలనే.. నిర్ణయం హరీశ్ రావుదేనా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ ఓ గుంపును తయారు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బాయ్‌కాట్ నిర్ణయం అధిష్టానానిదే అయితే.. అది మంచిది కాదని విమర్శించారు.

'బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టారు. అది చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సింది. హరీశ్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి మార్పులు జరిగాయి. హరీశ్ నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగింది.' అని కవిత విమర్శలు చేశారు.
కేసీఆర్ తప్పులు చేశారనే వాదన తప్ప కృష్ణానది నీటి వాటాపై చర్చ లేదని కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి.. వదిలేశారని ఆరోపణలు చేశారు. కృష్ణా నదిపై చిత్తశుద్ధి ఉంటే.. ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదని అన్నారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో సమస్య ఉంటే.. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ హోదా తొలగించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలన్నారు.
'గుంటనక్క హరీశ్ రావు వ్యవహారం తోక కుక్కను ఊపినట్లుగా ఉంది. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టాడు చెప్పి.. పీపీటీ చేయాలి. హరీశ్ రావు ధన దాహం కోసమే జూరాలా శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారు. హరీశ్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగింది.' అని కవిత అన్నారు.
కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కవిత మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే.. కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే.. అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కవిత మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే.. కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే.. అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}'కృష్ణా నది నీటిపై వాటాపై చర్చ పెట్టడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారు. కృష్ణా నీటిపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు పరిష్కరించడం లేదు.' అని కవిత విమర్శించారు.