...
...
Next Story

ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు ఎలా లీక్ అయ్యాయి? : కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ చర్చించిన విషయాలు బయటకు ఎలా వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లీకులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Published on: Dec 16, 2025 12:40 PM IST
Advertisement

ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. సరైన దిశలో వెళ్లడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, 8 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి

సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని ప్రధాని మోదీ సూచనలు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అని పేర్కొన్నారు. నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశంపై వచ్చిన లీకుల మీద మండిపడ్డారు. 'మోదీతో చర్చించిన విషయాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరో కావాలనే లీక్ చేశారు. ఈ సమావేశంలో ప్రస్తావించిన విషయాలను బయటకు చెప్పకూడదని మోదీ చెప్పారు.' అని కిషన్ రెడ్డి అన్నారు.

మీటింగ్‌లో జరిగిన విషయాలను బయట ఎందుకు చెప్పారని కిషన్ రెడ్డి అడిగారు. వారెవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ సమావేశ వివరాలను లీక్ చేయడం కచ్చితంగా తప్పేనన్నారు. లీక్ వీరులు ఎవరో తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేయాలని మోదీ చెప్పినట్టుగా వెల్లడించారు. దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉప రాష్ట్రపతులు అయ్యారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు.

'ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆయన అనైతికంగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయి. రాహుల్ గాంధీ విపక్షనేతగా ఉండటం దురదృష్టకరం.' అని కిషన్ రెడ్డి అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe