...
...
Next Story

త్వరలోనే ఎంఎంటీఎస్ ఫేజ్-II యాదాద్రి రైల్వే లింక్‌.. దక్షిణ కోస్తా రైల్వేపై అప్డేట్

2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల గురించి కేంద్రమంత్రి వెల్లడించారు. రైల్వే పురోగతి పనులు కూడా ఉన్నాయి.

Published on: Feb 3, 2026, 11:04:43 IST
Advertisement

2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య చేసిన సగటు వార్షిక కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ అని మంత్రి వైష్ణవ్ అన్నారు.

హై స్పీడ్ రైళ్లు

భారతీయ రైల్వే
భారతీయ రైల్వే

ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు-హైదరాబాద్-పుణే, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు.. వేగవంతమైన ప్రయాణ మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయని చెప్పారు. ఇవి ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా వేగవంతం చేస్తాయని వైష్ణవ్ అన్నారు.

ప్రయాణ సమయాల్లో మార్పులు

ఎలివేటెడ్ అలైన్‌మెంట్లు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు, ఇతర భాగాలపై మరిన్ని వివరాలు తగిన సమయంలో పంచుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. ఈ కారిడార్లలో ఆశించిన ప్రయాణ సమయాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు: 2 గంటలు, హైదరాబాద్–చెన్నై: 2 గంటల 55 నిమిషాలు, హైదరాబాద్–పుణె: 1 గంట 55 నిమిషాల్లో వెళ్లవచ్చన్నారు.

ఏపీకి కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,134 కోట్లు లభించాయని, రూ.92,649 కోట్ల విలువైన పనుల పురోగతిలో ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 2009–14 సగటుతో పోలిస్తే పదకొండు రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై రెండు హై-స్పీడ్ కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయని తెలిపారు.

దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు

దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్రం వేగంగా చేపడుతోందని, జోనల్ కార్యాలయాల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు. సిబ్బంది బదిలీలు, అధికార పరిధి విభాగాల ఏర్పాటు వంటి లాజిస్టిక్స్ కారణంగా కొత్త జోన్‌ను కార్యాచరణలోకి తీసుకురావడానికి సాధారణంగా మూడు నుండి నాలుగు సంవత్సరాలు పడుతుందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ పనిని వేగవంతం చేస్తున్నామని వివరించారు.

యాదాద్రి రైల్వే లింక్‌

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks