ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు లొంగిపోయారు. 14 రోజుల కస్టోడియల్ విచారణ గడువు ముగియటంతో… ఇవాళ ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత… ఇంటికి పంపించారు.
సిట్ దర్యాప్తు వేగవంతం - కీలక సమాచారం…!

ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ టీమ్ పని చేస్తోంది. ప్రభాకర్ రావును ఈ ప్రత్యేక బృందం పలుమార్లు విచారించింది. జూబ్లీహిల్స్ స్టేషన్‌లోని కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ కొనసాగింది. సిట్ సభ్యులు అంబర్‌కిశోర్ ఝా, విజయ్‌కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ జరిపారు. ఇదే కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడత విచారించారు.
ప్రత్యక్ష సాక్ష్యుల కంటే కూడా డిజిటల్ రికార్డుల ఆధారంగానే విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. రాజకీయ నేతల పాత్రతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్న పెన్ డ్రైవ్ లోని వివరాల ఆధారంగా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు బ్యాంక్ ఖాతాల గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.
ఇక ఈ కేసులో నందకుమార్ ని కూడా సిట్ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ అరెస్ట్ కూడా అయ్యారు. అయితే తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ డీజీపీగా రవి గుప్తా ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో పాటు ఎమ్మెల్యే కొనుగోలు కేసులోని వివరాల ఆధారంగా నందకుమార్ నుంచి కూడా సిట్ కొంత సమాచారాన్ని తీసుకుంది. ఫామ్ హౌస్ కేసులో ఆడియోలు, వీడియోలు ఎలా బయటికొచ్చాయనే దానిపై సిట్ అధికారులు ఆరా తీశారని నందకుమార్ చెప్పారు.
ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్…. కాల్ డేటా రికార్డులు, వాంగ్మూలాలు, పెన్ డ్రైవ్ లోని డేటాను విశ్లేషిస్తూ ముందుకెళ్తోంది. నిందితుల ఆర్థిక వ్యాపార వ్యవహారాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. దర్యాప్తు అత్యంత గోప్యంగా జరుగుతుండగా…. సిట్ సమర్పించే తుది నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రుల పేర్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో….. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్…. కాల్ డేటా రికార్డులు, వాంగ్మూలాలు, పెన్ డ్రైవ్ లోని డేటాను విశ్లేషిస్తూ ముందుకెళ్తోంది. నిందితుల ఆర్థిక వ్యాపార వ్యవహారాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. దర్యాప్తు అత్యంత గోప్యంగా జరుగుతుండగా…. సిట్ సమర్పించే తుది నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రుల పేర్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో….. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}