ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్థానికత లేదా నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ సంస్కరణ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
విద్యార్థుల ఇబ్బందులకు చెక్

ఇప్పటివరకు రెండు పథకాల కింద దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే డొమిసియల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండేది. అయితే, ఇతర రాష్ట్రాల్లో లేదా సొంత జిల్లా దాటి చదువుకునే విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఈ పత్రాన్ని పొందడానికి అనేక ఇబ్బందులు పడేవారు. సర్టిఫికెట్ కోసం సొంత ఊర్లకు ప్రయాణం చేయాల్సి రావడం, తలిదండ్రులు తమ రోజువారీ కూలీని నష్టపోవడం, కొన్నిసార్లు దళారులను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొనేవారు.
మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తం 4.13 కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 58 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు (14.2 శాతం), 1.47 కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు (35.8 శాతం) ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే (NSS), జనాభా లెక్కల వలసల డేటా ప్రకారం.. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది తమ సొంత జిల్లాలను విడిచి ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్నారు.
"పత్రాల సమర్పణ భారాన్ని తగ్గించడం, దరఖాస్తు ఖర్చులను ఆదా చేయడం, అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రయోజనాలు సులభంగా అందేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం" అని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.
స్కాలర్‌షిప్ పథకాల వివరాలు
ఈ రెండు స్కాలర్‌షిప్ పథకాలు వివిధ ఆదాయ వర్గాలకు చెందిన పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు వర్తిస్తాయి. ఎస్సీ విద్యార్థుల ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ 9, 10 తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది (తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి ₹2.5 లక్షలు). పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ ఉన్నత విద్య నుంచి పీహెచ్డీ (డాక్టొరల్) స్థాయి వరకు అందుతుంది.
{{/usCountry}}ఈ రెండు స్కాలర్‌షిప్ పథకాలు వివిధ ఆదాయ వర్గాలకు చెందిన పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు వర్తిస్తాయి. ఎస్సీ విద్యార్థుల ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ 9, 10 తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది (తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి ₹2.5 లక్షలు). పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ ఉన్నత విద్య నుంచి పీహెచ్డీ (డాక్టొరల్) స్థాయి వరకు అందుతుంది.
{{/usCountry}}ఓబీసీ విద్యార్థులకు సంబంధించి ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ పథకాలకు వార్షిక ఆదాయ పరిమితులు వరుసగా ₹2.5 లక్షలు, ₹1 లక్షగా ఉన్నాయి. ఇవి సీనియర్ సెకండరీ, ఐటీఐ కోర్సుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ డిగ్రీల వరకు వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ పథకాల కింద కేవలం ఎస్సీ లబ్ధిదారులకే ₹7,981 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేశారు. దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ఎడ్యుకేషన్ స్కీమ్స్‌లో ఇవి ఒకటిగా నిలిచాయి.
అందుబాటులోకి 'సేతు' (SETU) డిజిటల్ ప్లాట్‌ఫారమ్
పత్రాల సరళీకరణతో పాటు, స్కాలర్‌షిప్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు సామాజిక న్యాయ శాఖ ఉమాంగ్ (UMANG) యాప్‌లో 'సేతు' (SETU - Scholarship for Educational Transformation and Upliftment) అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్థులు, ఇన్‌స్టిట్యూషనల్ నోడల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్లు, రాష్ట్ర అధికారులందరికీ ఒకే వేదికగా ఉపయోగపడుతుంది. గతంలో వేర్వేరు ఛానళ్ల ద్వారా జరిగే దరఖాస్తు నమోదు, స్టేటస్ ట్రాకింగ్, వెరిఫికేషన్ ప్రక్రియలను ఇప్పుడు దీని ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు.
ఈ మార్పులపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖలు పాఠశాలలను ఆదేశిస్తున్నాయి. పంజాబ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తమ జిల్లా విద్యాధికారులకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
"సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, సంక్లిష్టమైన నిబంధనలను తొలగించడం, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా, పారదర్శకంగా అందించాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.