తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి గడువును మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ఈ పొడిగింపు మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఆలస్య రుసుముగా రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మే 13 నుండి మే 21 వరకు జరుగుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి మే 25 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష మే 26న ఉదయం 10 గంటల నుండి, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష అదే రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
ఇటీవల విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు.. రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చని ఇంటర్ బోర్డు చెప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రీ-వెరిఫికేషన్లో మార్పు లేదని భావిస్తే.. మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.
{{/usCountry}}ఇటీవల విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు.. రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చని ఇంటర్ బోర్డు చెప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రీ-వెరిఫికేషన్లో మార్పు లేదని భావిస్తే.. మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.
{{/usCountry}}ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,123 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు
మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)
మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)
మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ
మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)
మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)
మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)
మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)