తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి(2026-27) గాను రాష్ట్రంలో బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. శుక్రవారం(జులై 17) నుంచి టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇందులోనే ఈ అదనపు సీట్లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE) రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు దాదాపు 15 వేల అదనపు సీట్లను మంజూరు చేసింది. అయితే ఈ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో, గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విద్యాశాఖ అధికారులు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అదనపు సీట్ల భర్తీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అధికారులు ఏ కళాశాలలో ఎన్ని సీట్లు పెంచాలనే దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 4,000 అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.
ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయానికి ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని కళాశాలలకు అనుమతులు నిరాకరిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.
మరోవైపు, నిబంధనల ప్రకారం సీట్లు పెంచాలంటే జేఎన్టీయూహెచ్ (JNTUH), ఉస్మానియా వర్సిటీ (OU) పరిధిలోని అధికారులు కాలేజీల్లో తనిఖీలు చేసి మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ తనిఖీలు పూర్తికాకపోయినప్పటికీ, ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
{{/usCountry}}మరోవైపు, నిబంధనల ప్రకారం సీట్లు పెంచాలంటే జేఎన్టీయూహెచ్ (JNTUH), ఉస్మానియా వర్సిటీ (OU) పరిధిలోని అధికారులు కాలేజీల్లో తనిఖీలు చేసి మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ తనిఖీలు పూర్తికాకపోయినప్పటికీ, ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
{{/usCountry}}తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే సీట్లు మిగిలిపోయాయి. మొదటి విడతలో మిగిలిన సీట్లు 8,162, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లు 19,325, రెండో విడతకు సిద్ధంగా ఉన్న పాత సీట్లు 27,487గా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 27,487 సీట్లకు తోడు ఇప్పుడు కొత్తగా పెరిగే అదనపు సీట్లు కూడా తోడవనున్నాయి.