తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 25న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.

హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలు వెల్లడైన వెంటనే విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు పైచదువులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యాశాఖ కేవలం కొద్దిరోజుల్లోనే సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఫలితాలను సిద్ధం చేసింది.
ఫలితాలు చూసుకోవడం ఎలా?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కింద పేర్కొన్న పద్ధతి ద్వారా తమ మార్కులను మొబైల్ లేదా కంప్యూటర్ లో చూసుకోవచ్చు.
ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే "TS 10th Advanced Supplementary Results June 2026" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ ఓపెన్ అయ్యే కొత్త పేజీలో మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయండి.
వివరాలు ఇచ్చాక 'Submit' లేదా 'Get Result' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.
{{/usCountry}}వివరాలు ఇచ్చాక 'Submit' లేదా 'Get Result' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.
{{/usCountry}}ఫలితాలు విడుదలయ్యే మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెబ్‌సైట్‌పై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు విద్యార్థులు కంగారు పడకుండా కొద్ది నిమిషాల వ్యవధిలో వెబ్‌సైట్‌ను రీఫ్రెష్ చేస్తూ ఫలితాలను సులువుగా చెక్ చేసుకోవచ్చు.