ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన APRS CAT, APR JC. DC CET పరీక్షల ఫలితాలను ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
ఫలితాలు ఇలా!

ఈ ఏడాది గురుకులాల్లో మొత్తం 7,569 సీట్లు అందుబాటులో ఉండగా… ఏకంగా 76,376 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 66,300 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో జిల్లాల వారీగా విద్యార్థులు సత్తా చాటారు.
ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన APRS CAT లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హెచ్. వర్షిత్ (96/100), విజయనగరం జిల్లాకు చెందిన ఆకాష్ రెడ్డి (97/100), శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోక్షిత్ (90/100), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొర్లపాటి రక్షిత (96/100) అత్యుత్తమ మార్కులు సాధించారు.
APRJC CET (ఇంటర్మీడియట్):
- ఎంపీసీ: కొత్తకోట మహాలక్ష్మి (విజయనగరం జిల్లా) - 144/150
- బైపీసీ: తోలేటి బెర్నిస్ దియా (తూర్పు గోదావరి) - 145/150
- ఎంఈసీ: నందమూరి సాయి శశాంక్ (తూర్పు గోదావరి) - 143/150
- సీఈసీ: నందుపిల్లి లాస్య ప్రియ (తూర్పు గోదావరి) - 141/150
APRDC CET (డిగ్రీ):
- బీఏ: కొర్ర రాజేష్ (పార్వతీపురం మన్యం) - 101/150
- బీకామ్: మండల్ల అర్జునరెడ్డి (పల్నాడు) - 127/150
- బీఎస్సీ: చిప్పాడ వరుణ్ సాయి తేజ (కోనసీమ) - 112/150
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
అభ్యర్థులు తమ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్ https://aprs.apcfss.in ను సందర్శించాలి. అక్కడ తమ క్యాండిడేట్ ఐడీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}అభ్యర్థులు తమ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్ https://aprs.apcfss.in ను సందర్శించాలి. అక్కడ తమ క్యాండిడేట్ ఐడీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}ఎంపికైన విద్యార్థుల మెరిట్ జాబితా, కౌన్సెలింగ్ వివరాలను ఇవాళ (మే 13) ఆయా పాఠశాలలకు పంపిస్తారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీలు, వేదికల వివరాలను కూడా ఇవాళే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
రాష్ట్రంలోని 10 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, నీట్, సీఏ/CMA వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఎన్డీఏ, సీడీఎస్, ఆర్ఆర్ బీ వంటి పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కృష్ణమోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని ఆయన వివరించారు.