ఏపీ టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఓవైపు ఎగ్జామ్ జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. త్వరితగతిన స్పాట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా స్పాట్ వాల్యుయేషన్ తేదీలను కూడా ఖరారు చేశారు.
ఏప్రిల్ 4 నుంచి టెన్త్ స్పాట్…!

ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 10వ తేదీ తో అన్ని సబ్జెక్ట్ పేపర్లను పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను సిద్ధం చేసింది. స్పాట్ జరిగే కేంద్రాలతో పాటు సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై ఫోకస్ పెట్టింది.
మరోవైపు గతేడాది టెన్త్ మార్కుల కౌంటింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఈసారి ట్యాబ్‌లలో మార్కులు నమోదు చేయనున్నారు. పేపర్ల మూల్యాంకనంతో పాటు మార్కుల ఎంట్రీ వరకు ప్రతిదీ దశల వారీగా చేసి… ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు. అన్ని ఒకే అయిన తర్వాతే… ఫలితాల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ఇందుకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే…. ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతున్నాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘాలో ఉంచారు. దాదాపు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరించారు. అన్ని కేంద్రాలలో వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తాగునీరు, సీటింగ్ ఏర్పాట్లు, వెంటిలేషన్, ఫర్నిచర్‌ను ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
{{/usCountry}}పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘాలో ఉంచారు. దాదాపు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరించారు. అన్ని కేంద్రాలలో వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తాగునీరు, సీటింగ్ ఏర్పాట్లు, వెంటిలేషన్, ఫర్నిచర్‌ను ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
{{/usCountry}}