ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 22న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సహాయం నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,120.78 కోట్లు కేటాయించింది. దీని ద్వారా సుమారు 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

ఈ పథకం కింద గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్, ప్రభుత్వేతర, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో ఇంటర్మీడియట్‌తో సహా విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ. 15,000 అందుకుంటారు.
అయితే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి విద్యార్థి నుండి రూ.2,000 చొప్పున మినహాయించనుంది ప్రభుత్వం. తత్ఫలితంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు రూ. 13,000 బదిలీ అవుతుంది. అయితే మినహాయించిన మొత్తాన్ని పాఠశాల, జూనియర్ కళాశాలల నిర్వహణ, పారిశుధ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తారు.
మొదటి దశలో జూలై 22న.. 41,07,502 మంది తల్లులు, సంరక్షకుల్లో ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. 64,76,590 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్‌లో కొత్త ప్రవేశాలను చేర్చడం, పెండింగ్‌లో ఉన్న రికార్డులను సరిదిద్దిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య 42,70,802 మంది తల్లులకు పెరుగుతుందని అంచనా.
ప్రభుత్వం ఒకటో తరగతిలో సుమారు 59,500 కొత్త ప్రవేశాలు, జూనియర్ ఇంటర్మీడియట్‌లో 56,100 ప్రవేశాలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీనితో పాటు దాదాపు 1.55 లక్షల చెల్లని లేదా అసంపూర్ణ రికార్డులను సరిదిద్దనుంది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్, ప్రభుత్వేతర, రెసిడెన్షియల్ సంస్థలలో చేరిన విద్యార్థులకు వర్తిస్తుంది. అయితే ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్‌జీయూకేటీ (ఐఐఐటీ), ఇతర సంస్థలలో కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు కారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. కుటుంబ సభ్యులలో కనీసం ఒకరికి రైస్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మూడు ఎకరాలకు మించి తడి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న కుటుంబాలు, మున్సిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించిన నివాస ఆస్తి ఉన్నవారు అర్హులు కాదు..
{{/usCountry}}గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. కుటుంబ సభ్యులలో కనీసం ఒకరికి రైస్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మూడు ఎకరాలకు మించి తడి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న కుటుంబాలు, మున్సిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించిన నివాస ఆస్తి ఉన్నవారు అర్హులు కాదు..
{{/usCountry}}నెలసరి సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉన్న కుటుంబాలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా మినహాయించారు. అయితే పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కొంతమంది తక్కువ ఆదాయం గల ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. ఒంటరి తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలలో వర్తించే చోట ఆ మొత్తం తండ్రి ఖాతాకు జమ చేస్తారు.