...
...
Next Story

Azadi 501 OTT: రూ.251కే స్మార్ట్‌ఫోన్ సంచలనం గుర్తుందా? ఆ స్కామ్ కథతో ‘ఆజాది 501’ సిరీస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Azadi 501 OTT: ఇండియాలో కార్పొరేట్ అండ్ టెక్నాలజీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన 'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్ గుర్తుందా? ఈ స్కామ్ కథతో తెరకెక్కిన సరికొత్త ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఆజాది 501'. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

Published on: Jul 18, 2026, 17:34:29 IST
Advertisement

Azadi 501 OTT: డిజిటల్ విప్లవం మొదలవుతున్న రోజుల్లో ఒక చిన్న మొబైల్ ఫోన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రూ.251కే ఫోన్ అంటూ పెద్ద స్కామ్ జరిగింది. ఆ కుంభకోణం వెనుక ఉన్న మిస్టరీ కథను ప్రపంచానికి చెప్పేందుకు ‘ఆజాదీ 501’ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.

ఆజాదీ 501 ఓటీటీ డేట్

రూ.251కే స్మార్ట్‌ఫోన్ సంచలనం గుర్తుందా? ఆ స్కామ్ కథతో ‘ఆజాది 501’ సిరీస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే! (instagram-ahavideoin)
రూ.251కే స్మార్ట్‌ఫోన్ సంచలనం గుర్తుందా? ఆ స్కామ్ కథతో ‘ఆజాది 501’ సిరీస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే! (instagram-ahavideoin)

ఇండియాలో రియల్ టెక్ స్కామ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆజాదీ 501’. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ఈ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ఆహా వీడియో తాజాగా అనౌన్స్ చేసింది.

రూ.251కే స్మార్ట్ ఫోన్

ఒకప్పుడు కేవలం రూ. 251లకే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ కోట్ల మందిని నమ్మించి, ఆ తర్వాత రాత్రికి రాత్రే అదృశ్యమైన ఆ భారీ మోసపూరిత కథే ‘ఆజాది 501’. ఈ సిరీస్‌లో ఆ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఐడియాలజీ ఏంటి? అనేది చూపించనున్నారు.

చివరకు చట్టానికి ఎలా దొరికిపోయారు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు వంశీ రంగిశెట్టి దీనిని ఒక గ్రిప్పింగ్ క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్‌గా మలిచారు.

ఎందుకు చూడాలంటే?

‘స్కామ్ 1992’, ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వంటి ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామాలకు ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులు కేవలం నేరాన్ని మాత్రమే చూడరు.. ఆ నేరం వెనుక ఉన్న లూప్‌హోల్స్‌ను, హ్యూమన్ సైకాలజీని డీకోడ్ చేయడానికి ఇష్టపడతారు.

ఈ వెబ్ సిరీస్‌కు ప్రధాన బలం దీని కాస్టింగ్. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్, ఇంటెన్స్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శశాంక్ ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీరితో పాటు డి. గీతా భాస్కర్, రవివర్మ, రాకీ కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

థర్స్‌డే సినిమాస్ (Thursday Cinemas) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రచన రెడ్డి ములుముడి ఈ సిరీస్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించారు. యథార్థ గాథలను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'ఆజాది 501' ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks