...
...
Next Story

Bellamkonda Srinivas: బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్‌బై.. తిరుమ‌ల‌లో ఘ‌నంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అత‌ని భార్య ఎవ‌రంటే?

Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని అతను పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీనివాస్, కావ్య పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Published on: Apr 30, 2026, 08:58:32 IST
Advertisement

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేశాడు. ఈ టాలీవుడ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి (x/BSaiSreenivas)
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి (x/BSaiSreenivas)

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి తిరుమలలో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీళ్ల వెడ్డింగ్ ను గ్రాండ్ గా నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి 11 గంటల 13 నిమిషాల ముహూర్తానికి తిరుమలలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీళ్ల పెళ్లి జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి పెళ్లికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గ్రాండ్ గా రిసెప్షన్

బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం జరిగిన నేపథ్యంలో అతని భార్య కావ్య రెడ్డి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కావ్యకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం కానీ, సంబంధం కానీ లేదు.

కావ్య రెడ్డి తాత గతంలో జడ్జిగా పనిచేశారని అంటున్నారు. ఆమె తండ్రి ఓ లాయర్ అని తెలిసింది. శ్రీనివాస్, కావ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని టాక్. ఏప్రిల్ 6న హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సినిమా సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.

సినిమాలతో బిజీ

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, హైందవ, రామం సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా స్టోరీ పరంగా దేనికదే డిఫరెంట్ గా ఉంది. గతేడాది ‘కిష్కింధపురి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe