...
...
Next Story

Chiranjeevi: ఆందోళన వద్దు.. కల్యాణ్ బాబు సేఫ్.. పవర్ స్టార్ పవన్ సర్జరీపై చిరంజీవి ట్వీట్ వైరల్

Chiranjeevi: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సర్జరీ జరిగిన విషయం హాట్ టాపిక్ గా మారింది. తమ హీరోకు ఎలా ఉందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే వీళ్లందరి కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాజాగా అప్డేట్ ఇచ్చారు.

Published on: Apr 19, 2026 04:17 PM IST
Advertisement

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని అన్నయ్య చిరంజీవి వెల్లడించారు. తమ్ముడు పవన్ కల్యాణ్ హెల్త్ అప్ డేట్ ను ఎక్స్ ద్వారా మెగాస్టార్ షేర్ చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు సేఫ్ గా ఉన్నారని చిరు పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు.

చిరంజీవి ట్వీట్

పవన్ కల్యాణ్, చిరంజీవి (xKChiruTweets)
పవన్ కల్యాణ్, చిరంజీవి (xKChiruTweets)

తమ్ముడు పవన్ కల్యాణ్ హెల్త్ గురించి అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవర్ స్టార్ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. ఎక్స్ లో ఆదివారం (ఏప్రిల్ 19) చిరంజీవి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

కల్యాణ్ బాబు సేఫ్

‘‘కల్యాణ్ బాబుకు మెడికల్ ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది. అతను ఇప్పుడు సేఫ్ గా, స్టేబుల్ గా ఉన్నాడు. బాగానే కోలుకుంటున్నాడు. తిరిగి నార్మల్ లైఫ్ లోకి రావడానికి వారం రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు.

ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ ప్రేమకు, ప్రార్థనలకు, అభిమానానికి ధన్యవాదాలు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకోండి’’ అని చిరంజీవి ట్వీట్ పెట్టారు.

ఏం జరిగిందంటే?

‘‘ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు’’ అని జనసేన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్

పవన్ కల్యాణ్ చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe