...
...
Next Story

Pandu Master: యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ వీడియో.. అసలు ఏం జరిగిందో చెప్పిన కొరియోగ్రాఫర్.. హాస్పిటల్ బెడ్ పైనే!

Pandu Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, 'ఢీ' ఫేమ్ పండు మాస్టర్ విశాఖపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను బెడ్ పై నుంచే రిలీజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Published on: Jun 5, 2026, 19:46:32 IST
Advertisement

Pandu Master: బుల్లితెరపై తనదైన డాన్స్ స్టైల్ తో, అద్భుతమైన కొరియోగ్రఫీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు. ఈ టాలెంటెడ్ కొరియెగ్రాఫర్, ఎంటర్ టైనర్ తాజాగా జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న అతను ఓ వీడియో రిలీజ్ చేశాడు.

పండు మాస్టర్ వీడియో

యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ వీడియో.. అసలు ఏం జరిగిందో చెప్పిన కొరియోగ్రాఫర్ (x)
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ వీడియో.. అసలు ఏం జరిగిందో చెప్పిన కొరియోగ్రాఫర్ (x)

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో పండు మాస్టర్ మాటలు ఫ్యాన్స్ కు బాధ కలిగించేలా ఉన్నాయి. కళ్ల నిండా నీళ్లతో, నొప్పితో అల్లాడుతూనే అతను ఆసుపత్రి నుంచి మాట్లాడాడు.

"తగరపువలసలో ఈవెంట్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. ఆనందపురం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగాం. బయటకు దిగా. కారు ముందుకు వెళ్లి వాంతి చేసుకుంటున్నా. అప్పుడే కోళ్ల లోడ్ తో ఉన్న వ్యాన్ స్పీడ్ గా వచ్చి కారుకు డాష్ ఇచ్చింది" అని పండు మాస్టర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

రెండు కాళ్లు ఫ్రాక్చర్

‘‘కోళ్ల వ్యాన్ ఢీ కొట్టడంతో మా కారు నాపైకి దూసుకొచ్చింది. కారు నాపై ఎక్కడంతో రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నా. ఏం జరిగిందో అర్థం కాలేదు. హాస్పిటల్లోనే కల్లు తెరిచా’’ అని పండు యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు.

ఏం జరిగిందంటే?

పండు మాస్టర్ విడుదల చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అతను త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు, 'ఢీ' షో అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పండు, ఆ తర్వాత యూట్యూబ్ ఆల్బమ్స్, పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా చేశాడు. జబర్దస్త్ లో స్కిట్లతోనూ నవ్వించాడు.

People Also Ask (FAQ)

ప్రశ్న: పండు మాస్టర్‌కు ప్రమాదం ఎక్కడ జరిగింది?

జవాబు: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ప్రశ్న: ప్రమాదం ఎలా జరిగింది?

జవాబు: పండు మాస్టర్ కారును రోడ్డుపై వెళ్తున్న ఒక కోళ్ల లోడు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

ప్రశ్న: ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: ప్రమాదంలో ఆయన ముఖానికి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks