Dibyendu Bhattacharya: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభ కంటే రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా వెర్సటైల్ యాక్టర్ దివ్యేందు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి. బాలీవుడ్‌లో వర్ణ వివక్ష (Racism) అనేది చాలా లోతుగా పాతుకుపోయిన సమస్య అని, ఇది నటీనటుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన కుండబద్దలు కొట్టాడు.
నల్లగా ఉన్నానని

కేవలం నలుపు రంగులో ఉన్నాననే కారణంతో ఒక పెద్ద యాడ్ ఫిల్మ్ నుంచి తనను అర్ధాంతరంగా తొలగించారని దివ్యేందు భట్టాచార్య వెల్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో ఇప్పటికీ చర్మం రంగును బట్టే అవకాశాలు ఇస్తున్నారని బాలీవుడ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.
చేదు అనుభవం
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని దివ్యేందు వివరిస్తూ.. "ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. కొన్ని రోజుల క్రితమే ఒక యాడ్ షూటింగ్ కోసం నన్ను ఎంపిక చేశారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు చర్చలు జరిగాయి. షూటింగ్‌కు కేవలం మూడు రోజుల సమయం ఉందనగా, అసలు షూట్ ఉందో లేదో అని నేను వారిని అడిగాను’’ అని తెలిపాడు.
దానికి వారు స్పందిస్తూ.. ‘‘లేదు దాదా, మిమ్మల్ని మార్చేస్తున్నాం. ఎందుకంటే మీరు నల్లగా ఉన్నారు. మాకు నల్లగా ఉండే నటుడు వద్దు’’ అని ముఖం మీదే చెప్పారని దివ్యేందు సంచలన విషయాలు వెల్లడించాడు.
విద్యా వ్యవస్థలోనే లోపం
ఈ వివక్షకు మూలకారణం మన పెంపకం, విద్యా వ్యవస్థలోనే ఉందని దివ్యేందు పేర్కొన్నాడు. "ఇది చాలా దురదృష్టకరం, కానీ మనం ఏమీ చేయలేం. ప్రాథమిక విద్యలోనే సామాజిక నైతికత, విలువలను బోధించకపోతే ఎలాంటి మార్పు రాదు. జపాన్, కొరియా వంటి దేశాల్లో పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, ఎదుటివారి పట్ల సానుభూతిని నేర్పిస్తారు. మన దగ్గర ఆ బాధ్యత కేవలం ఇంటికే పరిమితమైంది. ఇంట్లో మంచి విలువలు నేర్పిస్తేనే పిల్లలు సభ్యతతో పెరుగుతున్నారు. కానీ సమాజం ఆ పాత్రను పోషించడం లేదు" అని దివ్యేందు అభిప్రాయపడ్డాడు.
దివ్యేందు భట్టాచార్య కెరీర్
ఇటీవలే దివ్యేందు 'ఉందేఖి' (Undekhi) సీజన్ 4లో కనిపించారు. మే 1న సోనీ లివ్లో విడుదలైన ఈ సిరీస్కు ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించాడు. ఇందులో హర్ష్ ఛాయా, సూర్య శర్మ, గౌతమ్ రోడే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి ముందు నెట్ఫ్లిక్స్లో వచ్చిన 'మామ్లా లీగల్ హై 2' సిరీస్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దివ్యేందు. రవి కిషన్, కుషా కపిల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
{{/usCountry}}ఇటీవలే దివ్యేందు 'ఉందేఖి' (Undekhi) సీజన్ 4లో కనిపించారు. మే 1న సోనీ లివ్లో విడుదలైన ఈ సిరీస్కు ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించాడు. ఇందులో హర్ష్ ఛాయా, సూర్య శర్మ, గౌతమ్ రోడే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి ముందు నెట్ఫ్లిక్స్లో వచ్చిన 'మామ్లా లీగల్ హై 2' సిరీస్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దివ్యేందు. రవి కిషన్, కుషా కపిల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
{{/usCountry}}