...
...
Next Story

థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న దృశ్యం 3.. అదిరిపోయే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ రిలీజ్ డేట్ ఇదే

ఇండియన్ సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్లు అంటే ముందుగా గుర్తొచ్చేది దృశ్యం సినిమాలు. ఒరిజినల్ మలయాళంలో వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత తెలుగు, హిందీల్లో రీమేక్ అయ్యాయి. ఇప్పుడు ఈ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా దృశ్యం 3 రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇశాళ అనౌన్స్ చేశారు.

Published on: Dec 22, 2025, 13:37:27 IST
Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్లలో ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత దృశ్యం 2 వచ్చింది. ఈ సినిమాలను తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు మలయాళంలో దృశ్యం 3 తెరకెక్కుతోంది. మరోవైపు హిందీలోనూ దృశ్యం 3 రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను సోమవారం (డిసెంబర్ 22) అనౌన్స్ చేశారు.

దృశ్యం 3 రిలీజ్ డేట్

దృశ్యం 3 రిలీజ్ డేట్
దృశ్యం 3 రిలీజ్ డేట్

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా యాక్ట్ చేస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం 'దృశ్యం 3'. ఈ మూవీ విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. సోమవారం ఉదయం చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న విడుదల కానుందని ఓ టీజర్ తో అనౌన్స్ చేసింది.

నాలుగేళ్లకు

అక్టోబర్ 2 తేదీకి దృశ్యం ఫ్రాంఛైజీకి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. కొత్త ప్రోమో ప్రకారం, 'దృశ్యం 3' 2026 అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీనికి ముందు వచ్చిన దృశ్యం 2 నాలుగేళ్ల ముందు రిలీజైంది. అది 2022లో విడుదలైంది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత పార్ట్ 3 వస్తుంది.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సాలగవోంకర్ పాత్రలో మళ్ళీ కనిపించనున్నాడు. టబు, శ్రియా శరన్, రజత్ కపూర్ కూడా తిరిగి ఈ ఫ్రాంఛైజీ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అజయ్ పిల్లలుగా నటించిన ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ కూడా తిరిగి వస్తున్నారు. 'దృశ్యం 2'లో పోలీసుగా నటించిన అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి వార్తలు లేవు. ట్రైలర్‌పై అధికారిక ప్రకటన 2026లో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నారు.

దృశ్యం ఫ్రాంచైజీ గురించి

దృశ్యం చిత్రం విజయం సాధించడంతో 2022లో సీక్వెల్ దృశ్యం 2ను రిలీజ్ చేశారు. ఇది మరింత పెద్ద హిట్ అయింది. 'దృశ్యం 2' ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దృశ్యం 3 రాబోతుంది. దీనికి అభిషేక్ పాఠక్ డైరెక్టర్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks