...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు అప్పు తీర్చడానికి సత్యం ఉద్యోగం.. రోహిణిపై అనుమానం.. మనోజ్‌ను ఉతికిన తల్లి

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో బాలు అప్పు తీర్చడానికి సత్యం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు తనకు హ్యాండిచ్చిన మనోజ్ ను అందరి ముందే చితకబాదుతుంది తల్లి ప్రభావతి.

Published on: Apr 15, 2026, 07:38:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన పనికి అందరి ముందూ ప్రభావతి దొంగలా నిలబడుతుంది. ఆమె తరఫున సంతకం చేయడానికి మనోజ్ అంగీకరించకోవడంతో సత్యమే సంతకం చేసి అప్పు తీర్చడానికి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు.

డబ్బు దొరికిందంటూ రూ.2 లక్షలు ఇచ్చిన కామాక్షి

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు అప్పు తీర్చడానికి సత్యం ఉద్యోగం.. రోహిణిపై అనుమానం.. మనోజ్‌ను ఉతికిన తల్లి
Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు అప్పు తీర్చడానికి సత్యం ఉద్యోగం.. రోహిణిపై అనుమానం.. మనోజ్‌ను ఉతికిన తల్లి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్ సత్యం, ప్రభావతి ఇంటికి కామాక్షి వచ్చే సీన్ తో మొదలవుతుంది. డబ్బు పోలేదని, డబ్బా మారిందని చెప్పి ఆ రూ.2 లక్షలు ఇచ్చేస్తుంది. దీంతో బాలు, మీనా కలిసి ప్రభావతిపై మండిపడతారు. అనవసరంగా కోడలిపై దొంగతనం ముద్ర వేశావంటూ భార్యను సత్యం నిలదీస్తాడు. అదే సమయంలో రోహిణిని కూడా ఇరికిస్తాడు.

రోహిణిని ఇరికించిన సత్యం

మీనా ఆ ఇంటికి వెళ్లిన రోజు అంతకుముందే రోహిణి కూడా కామాక్షి ఇంటికి వెళ్లిందని సత్యం చెబుతాడు. దీంతో రోహిణి, మనోజ్ షాక్ తింటారు. ఆ ఇంటికి వెళ్లినంత మాత్రం దొంగ అయిపోతుందా అని మనోజ్ అంటే.. మరి మీనా వెళ్తే ఆమె దొంగవుతుందా అని ప్రశ్నిస్తాడు. తాను దొంగతనం చేయలేదని రోహిణి అంటే.. నువ్వు చేశావని కాదు.. కానీ ఆ ఇంటికి వెళ్లిన వాళ్లపై ఆ ముద్ర వేయడం కరెక్ట్ కాదని అంటున్నానని సత్యం చెబుతాడు. అప్పుడే మీనాలోనూ రోహిణిపై అనుమానం మరింత ఎక్కువవుతుంది.

తల్లికే వడ్డీ అంటూ షాకిచ్చిన మనోజ్

ఆ డబ్బు తానే ఇస్తానని రాసివ్వాలంటూ ప్రభావతిని బాలు అడుగుతాడు. ఓ పెన్నూ, పేపర్ పట్టుకొస్తాడు. తర్వాత ప్రభావతి రాసి సంతకం పెడుతుంది. దీనికి నీ పెద్ద కొడుకు గ్యారెంటీ ఇవ్వాలని అనడంతో అందరూ మనోజ్ వైపు చూస్తారు. అమ్మ చేసిన దానికి నాకేంటి సంబంధం అని అతడు అంటాడు.

మనోజ్‌ను లాగిపెట్టి కొట్టిన ప్రభావతి

దీంతో భార్య తరఫున సత్యమే సంతకం పెట్టడానికి ముందుకొస్తాడు. బాలు, మీనా వద్దని వారిస్తున్నా.. భార్య చేసిన తప్పులో తనకూ భాగం ఉందంటూ అతడూ సంతకం పెడతాడు. అప్పుడే ప్రభావతి వెళ్లి మనోజ్ ను లాగి పెట్టి కొడుతుంది. దీంతో అతడు కాళ్ల దగ్గర పడతాడు. ఛీ అంటూ సత్యం చీదరించుకొని వెళ్లిపోతాడు.

అప్పు తీర్చడానికి సత్యం ఉద్యోగం.. విడాకులివ్వాలంటూ..

ఆ తర్వాత సత్యం ఇంటికి కామాక్షి భర్త రంగా వస్తాడు. 30 ఏళ్ల కిందట ప్రభావతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని, తన భార్య వల్ల రూ.5 లక్షలు అప్పు అయిందని, దానిని తీర్చడానికి తనకు ఉద్యోగం కావాలని అంటాడు. దీంతో అందరూ షాక్ తింటారు.

అంతేకాదు ప్రభావతి చేసిన తప్పుకు ఆమెకు విడాకులివ్వాలని, కానీ ఇంటి పరువు పోతుందని అప్పు తీర్చాలని నిర్ణయించుకున్నట్లు చెబుతాడు. ఈ వయసులో నువ్వు ఉద్యోగం చేయడమేంటని బాలు, మీనా వారిస్తున్నా.. తన నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని అనడంతో వాళ్లు ఏమీ అనరు. స్కూల్లో ఉద్యోగం చూస్తానంటూ చెప్పి రంగా వెళ్లిపోతాడు.

కొత్తింట్లోకి సుగుణ, చింటు.. హెచ్చరించిన రోహిణి

మరోవైపు సుగుణ, చింటులను కొత్త ఇంట్లోకి తీసుకెళ్తుంది రోహిణి. దీంతో చింటు చాలా సంతోషిస్తాడు. అతన్ని మంచి స్కూల్లో వేస్తానని రోహిణి చెబుతుంది. అయితే ఈ ఇల్లు చాలా కష్టంగా దొరికిందని, ఇక్కడ ఎవరితోనూ మాట్లాడొద్దని, ఎవరినీ కలవొద్దని తల్లికి రోహిణి కండిషన్స్ పెడుతుంది. అది విని సుగుణ షాక్ తింటుంది. విద్య కూడా రోహిణిని నిందిస్తుంది.

సత్యం కోసం బాలు డబ్బు

ఇటు కామాక్షి ఇంటికి వెళ్తాడు బాలు. అప్పుడే సత్యంకు ఓ ఉద్యోగం చూశానంటూ రంగా వస్తాడు. ఈ వయసులో ఆయనకు ఉద్యోగం ఎందుకు మామ.. వద్దు అని బాలు చెబుతాడు. తన జేబులో నుంచి డబ్బు తీసి రంగాకు ఇస్తాడు.

నాన్నకు పిల్లలంటే ఇష్టం.. ఏదైనా పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పమని నాన్నుకు చెప్పండి.. వాళ్ల తల్లిదండ్రులు ఫీజు ఇస్తున్నారని ఈ డబ్బును నాన్ను ఇవ్వు అని బాలు చెబుతాడు. రంగా సరే అంటాడు. తండ్రిపై బాలు చూపిస్తున్న ప్రేమ చూసి కామాక్షి, రంగా తమకూ ఇలాంటి ఓ కొడుకు ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe