...
...
Next Story

నా పేరు చెప్పి మోసం చేస్తున్నారు.. కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ వార్నింగ్.. సంచలన పోస్ట్.. ఏమైందంటే?

'కాంతార చాప్టర్ 1' హీరోయిన్ రుక్మిణి వసంత్ పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది. తన పేరుతో మోసం చేస్తున్న ఓ వ్యక్తి గురించి సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలను హెచ్చరించింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 09, 2025 05:15 PM IST
Advertisement

‘కాంతార చాప్టర్ 1’ హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పేరుతో మోసం చేస్తున్న ఓ వ్యక్తి గురించి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలను హెచ్చరించారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఒక ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేసి, బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

రుక్మిణి వసంత్ వార్నింగ్

రుక్మిణి వసంత్
రుక్మిణి వసంత్

రుక్మిణి వసంత్ వార్నింగ్ ఇచ్చారు. ఒక నంబర్‌ను పోస్ట్ చేస్తూ, ఆ నంబర్ వాడుతున్న వ్యక్తి తనలా నటిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని రుక్మిణి వసంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

“ముఖ్యమైన హెచ్చరిక & అవగాహన సందేశం. 9445893273 నంబర్‌ను ఉపయోగిస్తున్న ఒక వ్యక్తి నా పేరుతో నకిలీ ప్రచారం చేస్తూ పలువురిని సంప్రదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ నంబర్ నాకు చెందినది కాదు. దీని నుండి వచ్చే సందేశాలు లేదా కాల్స్ పూర్తిగా నకిలీవి. దయచేసి అటువంటి సందేశాలకు స్పందించవద్దు. ఈ మోసం సైబర్‌క్రైమ్ కిందకు వస్తుంది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం” అని ఆమె రాశారు.

బెంగళూరు పోలీసుల రియాక్షన్

రుక్మిణి 2025లో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమిళ చిత్రాలైన 'ఏస్', 'మదరాసి'లో నటించారు. ఇటీవల ఆమె కన్నడ హిట్ చిత్రం 'కాంతార చాప్టర్ 1'లో నటించారు. ఇది ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ఆమె త్వరలో కన్నడ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్', జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెలుగు చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe