సినిమా పరిశ్రమలో వారసత్వం లేకుండా నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. సుమారు 15 ఏళ్ల క్రితం నటిగా కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ నేడు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి మృణాల్ ఠాకూర్ పడ్డ శ్రమ, చూపిన ధైర్యం సామాన్యమైనవి కావని చెబుతోంది. తాజాగా ఇచ్చిన సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ రహస్యాలను మృణాల్ ఠాకూర్ బయటపెట్టారు.
స్వయంగా వెళ్లి
అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రవి ఉద్యావర్ డైరెక్ట్ చేసిన సినిమా 'దో దీవానే షెహర్ మే' (Do Deewane Seher Mein). ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేశారు. అయితే, ఈ సినిమాలో అవకాశం మృణాల్ ఠాకూర్‌కు తలుపు తట్టి రాలేదట. ఆమెనే స్వయంగా వెళ్లి హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారని చెబుతోంది ఈ బ్యూటి.
"రవి సర్ తీసిన 'మామ్' సినిమా చూశాక ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. నేనే నేరుగా వెళ్లి.. సర్, మనం నెక్ట్స్ సినిమా ఎప్పుడు చేస్తున్నాం? అని అడిగేశాను. నాలో ఉన్న ఆ ధైర్యమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని నేను నమ్ముతాను" అని మృణాల్ ఠాకూర్ న్యూస్18తో పేర్కొన్నారు.
దర్శకుల వెంట పడటం తప్పు కాదు..
కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని మృణాల్ గుర్తుచేసుకున్నారు. "ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం దర్శకులకు కనిపించేలా చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. సర్, నేను ఇక్కడే ఉన్నాను.. ఏదో ఒక రోజు నన్ను తప్పకుండా కాస్ట్ చేయండి అని బతిమిలాడేదాన్ని" అని మృణలా ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
{{/usCountry}}కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని మృణాల్ గుర్తుచేసుకున్నారు. "ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం దర్శకులకు కనిపించేలా చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. సర్, నేను ఇక్కడే ఉన్నాను.. ఏదో ఒక రోజు నన్ను తప్పకుండా కాస్ట్ చేయండి అని బతిమిలాడేదాన్ని" అని మృణలా ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
{{/usCountry}}"'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ గారే నేను పని కోసం అడిగిన మొదటి వ్యక్తి. అప్పట్లో పని ఎలా అడగాలో కూడా నాకు సరిగ్గా తెలియదు" అని మృణాల్ ఠాకూర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
దర్శకుల ఆలోచన విధానం మారుతుంది
ఒక నటి ఏదైనా పాత్ర కోసం ఆకలితో ఉందని తెలిస్తే, దర్శకుల ఆలోచనా విధానం కూడా మారుతుందని మృణాల్ అభిప్రాయపడ్డారు. తనకు నచ్చిన వ్యక్తులకు, వారు వ్యక్తిగతంగా తెలియకపోయినా సరే, మెసేజ్ చేసి తన ఆసక్తిని తెలపడం మృణాల్‌కు అలవాటు అట.
ఫిబ్రవరి 20న ‘దో దీవానే షెహర్ మే’ విడుదల
ఇక మృణాల్ ఠాకూర్, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా దో దీవానే షెహర్ మే ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. ఇది ఒక అరేంజ్‌డ్ మ్యారేజ్ నేపథ్యంలో సాగే కథ. శారీరక, వ్యక్తిగత అభద్రతా భావాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, ఆత్మీయత ఎలా చిగురించాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు.