ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల ప్రసారానికి ఈసారి ప్రేక్షకాదరణ తగ్గింది. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన రేటింగ్స్, ఈ ఏడాది మళ్లీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రముఖ హోస్ట్ కోనన్ ఓ'బ్రియన్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన గణాంకాలను వాల్ట్ డిస్నీ సంస్థ వెల్లడించింది.
9 శాతం తగ్గిన వ్యూయర్‌షిప్

గత ఆదివారం జరిగిన ఆస్కార్స్ 2026 వేడుకను ఏబీసీ (ABC), హులు (Hulu) ప్లాట్‌ఫామ్‌లలో కలిపి సుమారు 17.9 మిలియన్ల (ఒక కోటి 79 లక్షల) మంది వీక్షించారు. గత ఏడాది ‘అనోరా’ చిత్రం అవార్డు గెలుచుకున్నప్పుడు 19.7 మిలియన్ల మంది ఆ ఈవెంట్ ను చూశారు. ఈ సారి ఆ సంఖ్య 9 శాతం తగ్గింది.
యూత్ దూరం
ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు ముఖ్యంగా యూత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఈవెంట్ చూసిన వాళ్లలో 18 నుంచి 49 వయసు మధ్య ఉన్నవాళ్లలో 14 శాతం తగ్గుదల కనిపించింది.
వార్నర్ బ్రదర్స్ సినిమాల పోటీ
ఈ ఏడాది ఆస్కార్ రేసులో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన రెండు చిత్రాలు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్”, "సిన్నర్స్" మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు లాంటి రెండు మెయిన్ అవార్డులను "వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" కైవసం చేసుకుంది.
ఆస్కార్స్ చరిత్రలో అత్యధికంగా 16 నామినేషన్లు పొందిన చిత్రం “సిన్నర్స్” నుంచి మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.
సోషల్ మీడియాలో మాత్రం
టీవీ, ఓటీటీ రేటింగ్స్ తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో ఆస్కార్స్ ప్రభంజనం సృష్టించింది. సోషల్ ఇంప్రెషన్స్ గత ఏడాదితో పోలిస్తే 42 శాతం పెరిగాయి. అకాడమీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో వీడియో వీక్షణలు 129 మిలియన్లు దాటడం విశేషం. 2025-2026 సీజన్లో ఇప్పటికీ నంబర్ 1 ప్రైమ్‌టైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌గా ఆస్కార్స్ 2026 నిలిచింది.
గతంతో పోలిస్తే
{{/usCountry}}టీవీ, ఓటీటీ రేటింగ్స్ తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో ఆస్కార్స్ ప్రభంజనం సృష్టించింది. సోషల్ ఇంప్రెషన్స్ గత ఏడాదితో పోలిస్తే 42 శాతం పెరిగాయి. అకాడమీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో వీడియో వీక్షణలు 129 మిలియన్లు దాటడం విశేషం. 2025-2026 సీజన్లో ఇప్పటికీ నంబర్ 1 ప్రైమ్‌టైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌గా ఆస్కార్స్ 2026 నిలిచింది.
గతంతో పోలిస్తే
{{/usCountry}}ఒకప్పుడు 50 మిలియన్ల మందికి పైగా వీక్షించిన ఆస్కార్స్ వేడుక కాలక్రమేణా డిజిటల్ వైపు మళ్లుతోంది. 1998లో "టైటానిక్" విజయం సాధించినప్పుడు అత్యధికంగా 57.2 మిలియన్ల మంది ఈవెంట్ ను చూశారు. అయితే 2021 కోవిడ్ సమయంలో ఇది 10.4 మిలియన్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
భవిష్యత్తు ప్రణాళిక
2029లో జరగబోయే 101వ ఆస్కార్ వేడుకలు పూర్తిస్థాయిలో యూట్యూబ్ కు మారనున్నాయి. ఆ సమయానికి టీవీ రేటింగ్స్‌తో సంబంధం లేకుండా డిజిటల్ వ్యూయర్‌షిప్ ప్రాతిపదికగా అవార్డుల విజయాన్ని అంచనా వేయనున్నారు.