...
...
Next Story

ఏఐ వాడలేదు-ప్రతి ఫ్రేమ్ పాత పద్ధతిలోనే-విజయ్ దేవరకొండ రణబాలి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్-ఈ దర్శకుడి సినిమాలు తెలుసా?

రణబాలి అంటూ విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా కొత్త అవతారంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. అతని దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న రణబాలి గ్లింప్స్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో గ్లింప్స్ కోసం ఏఐ వాడలేదని, పాత పద్ధతితోనే ప్రతి ఫ్రేమ్ రూపొందించామని రాహుల్ తెలిపాడు.

Published on: Jan 27, 2026, 10:20:06 IST
Advertisement

వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఆ హిట్ అందించే బాధ్యతను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ సాంకృత్యాన్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి హైప్ క్రియేట్ చేస్తోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్బంగా రిలీజ్ చేసిన రణబాలి గ్లింప్స్ అదిరిపోయాయి.

రణబాలి గ్లింప్స్

రణబాలి పోస్టర్ (x/Rahul_Sankrityn)
రణబాలి పోస్టర్ (x/Rahul_Sankrityn)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూడో సినిమా రణబాలి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జోడీ ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ఇప్పుడు రణబాలిలో మరోసారి జతకట్టారు. ఈ మూవీ గ్లింప్స్ వైరల్ గా మారాయి. భారత ఇండిపెండెన్స్ కు ముందు బ్రిటీష్ వాళ్ల దురాగతాలను చాటేలా గ్లింప్స్ ఉంది. రౌద్ర రూపంలో లాస్ట్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ అదిరిపోయింది.

రాహుల్ సాంకృత్యాన్ కామెంట్లు

రణబాలి గ్లింప్స్ కు సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. అయితే ఎక్స్ లో ఓ యూజర్ ఈ గ్లింప్స్ ను పొగుడుతూనే ఇందులో ఎక్కువ భాగం ఏఐ వాడినట్లు ఉన్నారని పోస్టు చేశాడు. దీనికి రణబాలి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రియాక్టయ్యాడు. అసలు ఈ గ్లింప్స్ కోసం ఏఐ వాడలేదన్నాడు.

ఏఐ వాడలేదు

‘‘థ్యాంక్ యూ ఇడ్లీబ్రెయిన్ జీవి గారు. కానీ ఏఐ మాత్రం వాడలేదు. ప్రతి ఫ్రేమ్ ను పాత పద్ధతిలోనే తీర్చిదిద్దాం. అందుకు కొన్ని నెలల సమయాన్ని వెచ్చించాం’’ అని రాహుల్ సాంకృత్యాన్ రియాక్టయ్యాడు.

రాహుల్ సాంకృత్యాన్ సినిమాలు

2014లో వచ్చిన హారర్ మూవీ ‘ది ఎండ్’తో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతోనే 2018లో ట్యాక్సీవాలా మూవీ తీశాడు. 2021లో నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమాను తెరకెక్కించాడు రాహుల్ సాంకృత్యాన్.

విజయ్, రష్మిక పెళ్లి

లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వచ్చే నెలలో జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. 2025 అక్టోబర్ లో వీళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రష్మిక మందన్న చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

2018లో వచ్చిన గీత గోవిందం సినిమాలో విజయ్, రష్మిక తొలిసారి కలిసి పనిచేశారు. అప్పటి నుంచే వీళ్ల రిలేషన్ షిప్ స్టార్ట్ అయిందని అంటున్నారు. 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ తో వీళ్ల ప్రేమ మరింత స్ట్రాంగ్ గా మారింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రణబాలిలో కలిసి నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks