...
...
Next Story

ద్విభాషా చిత్రంగా కార్మేని సెల్వం- సముద్ర ఖని, గౌతమ్ మీనన్ కీ రోల్స్- ఒక సాధారణ మనిషి కథ అన్న దర్శకుడు రామ్ చక్రి!

Carmeni Selvam Release Date Announced: నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కీ రూల్ పోషించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ కార్మేని సెల్వం. రామ్ చక్రి దర్శకత్వం వహించిన కార్మేని సెల్వం రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Mar 06, 2026 09:01 AM IST
Advertisement

టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సముద్ర ఖని. అలాగే, తెలుగులో మంచి క్రేజ్ ఉన్న స్టార్ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. వీరిద్దరి కలియకలో, కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కార్మేని సెల్వం.

ద్విభాషా చిత్రంగా కార్మేని సెల్వం

ద్విభాషా చిత్రంగా కార్మేని సెల్వం- సముద్ర ఖని, గౌతమ్ మీనన్ కీ రోల్స్- ఒక సాధారణ మనిషి కథ అన్న దర్శకుడు రామ్ చక్రి!
ద్విభాషా చిత్రంగా కార్మేని సెల్వం- సముద్ర ఖని, గౌతమ్ మీనన్ కీ రోల్స్- ఒక సాధారణ మనిషి కథ అన్న దర్శకుడు రామ్ చక్రి!

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా నిర్మించిన ఈ కార్మేని సెల్వం సినిమాను తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకత్వంలో వహించారు. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా.. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కార్మేని సెల్వం నటీనటులు

కార్మేని సెల్వం సినిమాలో సముద్ర ఖని, గౌతమ్ మీనన్‌తోపాటు లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు గురువారం (మార్చి 5) ప్రకటించారు.

థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తి

కార్మేని సెల్వం చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కారు డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు.

నిజాయితీ, జీవన పోరాటం మధ్య

ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.

సాధారణ మనిషి కథ

రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. "కార్మేని సెల్వం ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం" అని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe