...
...
Next Story

Sara Ali Khan: సారా అలీ ఖాన్‌కు షాక్! కేదార్‌నాథ్ వెళ్లాలంటే ఆ సంతకం తప్పనిసరి.. పవన్ కల్యాణ్ కూతురిలాగే.. ఏమైందంటే?

బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సనాతన ధర్మంపై విశ్వాసం ఉన్నట్లు అఫిడవిట్ ఇస్తేనే బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు దర్శనం కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ కుమార్తె విషయంలో తిరుపతిలో జరిగిన సంఘటనను పోలుస్తూ జరుగుతున్న ఈ చర్చ వైరల్ గా మారింది.

Published on: Mar 18, 2026 01:57 PM IST
Advertisement

బాలీవుడ్ స్టార్ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (BKTC) షాకిచ్చింది. ప్రతి ఏటా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించే సారా, ఇకపై దర్శనం చేసుకోవాలంటే తన విశ్వాసాన్ని నిరూపించుకుంటూ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

ప్రవేశం కొత్త నిబంధన

సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్

మార్చి 10న జరిగిన బీకేటీసీ సమావేశంలో సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారి ప్రవేశాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందువులు కానివారు ఎవరైనా సరే, తమకు హిందూత్వంపై నమ్మకం ఉందని వ్రాతపూర్వక ప్రకటన ఇస్తేనే ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

తండ్రి ముస్లిం

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తల్లి అమృతా సింగ్ (సిక్కు), తండ్రి సైఫ్ అలీ ఖాన్ (ముస్లిం) వేరు వేరు మతాలకు చెందిన వాళ్లు. దీంతో సారా అలీ ఖాన్ విషయంలో ఈ కొత్త నిబంధన కూడా అమలు అవుతుంది. ఆమె బద్రీనాథ్ కు వెళ్లాలంటే తప్పనిసరి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సారా అలీ ఖాన్ ఇంకా రియాక్ట్ అవలేదు.

పవన్ కల్యాణ్ కుమార్తె

గతంలో తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పోలెనా అంజనా పవనోవా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇదే విధంగా విశ్వాస ప్రకటనపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ ఫారమ్‌పై సంతకం చేశారు. పోలెనా తల్లి క్రిస్టియన్ కావడంతో అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు అదే తరహా నిబంధనను కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయాల్లోనూ అమలు చేయబోతున్నారు.

సారా ఏమందంటే?

బీకేటీసీ ఇప్పటికే ఈ అఫిడవిట్ కోసం ఒక ఫార్మాట్‌ను రెడీ చేసింది. ఈ ప్రతిపాదనను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కూడా పంపారు. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు ముందు ఇది అమల్లోకి రానుంది. ఈ యాత్ర కోసం ఇప్పటికే 6 లక్షల మందికి పైగా భక్తులు నమోదు చేసుకున్నారు. బద్రీనాథ్ ధామ్ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ ను ఏప్రిల్ 22 న తెరుస్తారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe