సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఒకప్పుడు ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని నిర్మాతలు భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కంటెంట్ లో దమ్ముంటే 'A' రేటింగ్ సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన టాప్ 'A' రేటింగ్ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. తాజాగా ధురంధర్ సినిమా రూ.1000 కోట్ల మార్క్ దాటి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద 'A' సర్టిఫికేట్ సినిమాల హవా

గతంలో కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉండేది. కానీ నేటి యువత "రా అండ్ రస్టిక్" కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అత్యంత హింస, బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
ధురంధర్
తాజాగా ధురంధర్ మూవీ రూ.1000 కోట్ల మార్క్ దాటింది. సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ అందుకొని ఈ మార్క్ దాటిన తొలి ఇండియన్ మూవీ ఇదే. యానిమల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. మితిమీరిన హింస ఉన్నా కూడా ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాదు అత్యంత వేగంగా అంటే కేవలం 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం.
యానిమల్
2023లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ను అత్యంత హింసాత్మకంగా చూపించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' రేటింగ్ ఇచ్చింది. అయినా ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్లు వసూలు చేసింది.
సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు కూడా 'A' సర్టిఫికేట్ లభించింది. ఇందులోని మితిమీరిన హింస కారణంగా సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయినా ఈ మూవీ సుమారు రూ.700 కోట్ల వరకూ వసూలు చేసింది.
కూలీ
{{/usCountry}}రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు కూడా 'A' సర్టిఫికేట్ లభించింది. ఇందులోని మితిమీరిన హింస కారణంగా సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయినా ఈ మూవీ సుమారు రూ.700 కోట్ల వరకూ వసూలు చేసింది.
కూలీ
{{/usCountry}}సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ అయినా కూలీకి కూడా ఎ సర్టిఫికెటే ఇచ్చారు. ఇందులోనే హింస కారణంగానే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కూడా రూ.518 కోట్లు వసూలు చేయడం విశేషం.
అర్జున్ రెడ్డి / కబీర్ సింగ్
తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్'.. ఈ రెండు సినిమాలు 'A' రేటింగ్ ట్రెండ్‌ను సెట్ చేశాయి. యూత్ ఎమోషన్స్‌ను పీక్స్‌లో చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కబీర్ సింగ్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.377 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
కిల్
ఇటీవల వచ్చిన బాలీవుడ్ సినిమా కిల్ అత్యంత క్రూరమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో వార్తల్లో నిలిచింది. ఒక రైలు ప్రయాణంలో జరిగే హింసను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. బడ్జెట్ తక్కువైనా, బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను ఆర్జించింది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు గొప్ప ఆదరణ లభించింది.